అరగంట వ్యాయామంతో ఆరోగ్యం
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు నాజూగ్గా మారడానికి చాలా కష్టపడుతున్నారు. అవును కదా! ఎందుకు అంతలా కష్టపడుతున్నారు. అరే మీకు తెలిదా? నాజూగ్గా మారడానికి రోజుకి అరగంట వ్యాయామం చాలని ఈ మధ్య ఓ సర్వేలో తేలింది. ఓ అధ్యయన సంస్థ లావుగా వున్న కొంత మందిని ఎంపిక చేసుకొని, సగం మందిని రోజు అరగంట క్రమం తప్పకుండ వ్యాయామం చేయమన్నారు. మిగతా సగం మందిని గంట పాటు వ్యాయామం చెయ్యమన్నారు. ఇలా వీరిని 3 నెలల తరువాత కెలొరీలు, హార్ట్ బీట్, బరువు లెక్కిస్తే అరగంట వ్యాయామం చేసిన వాళ్ళ బరువు తగ్గినట్టు ఆరోగ్యంగా ఉన్నట్టు తేలింది.
ఇలా ప్రతిరోజు వ్యాయామం చేయడం వలన శరీర బరువును తగ్గించడమే కాకుండా శరీర ఆకృతిని కూడా పెంచుకోవచ్చు. వయస్సు పై బడిన వారికి కూడా దీని వలన చాల ప్రశాంతత లభిస్తుంది. పిల్లలలో ఏకాగ్రత పెంచడానికి వ్యాయామం చాలా బాగా తోడ్పడుతుంది. అందుకే ప్రతి రోజు అరగంట వ్యాయామం చాలని మన శాస్త్రవేత్తలు చెపుతున్నారు.
- యం. స్వప్న