ఆడవాళ్ళ అందాలల్లో బాగా ఆకట్టుకునేవి కళ్ళు మాత్రమే! మరి అలాంటి ఆకర్షించే కళ్ళు మీ సొంతం కావాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మరి అవేంటో చూద్దామా...!
1. ప్రతిరోజూ సరిపోయేంతగా నిద్రపోవాలి. అలా నిద్రపోవడం వల్ల మీ కళ్ళు తాజాగా కనబడుతుంటాయి.
2. పాలమీగడతో కళ్ళ చుట్టూ మసాజ్ చేసుకుంటే, కళ్ళ చుట్టూ ఉండే మడతలు పోయి మరింత ఆకర్షణగా కనబడుతుతాయి.
3. కీరదోసలను తినడమే కాకుండా, ఆ కీరదోసకాయలను గుండ్రని ముక్కలుగా చేసుకొని కళ్ళ మీద పెట్టుకోవడం వల్ల, కళ్ళు తాజాగా ఉంటాయి.
4. ఆకుకూరలు, కూరగాయలు, చేపలు వంటి తాజా ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
5. ప్రతిరోజూ మంచి నీటితో కళ్ళను కడుక్కోవాలి. దీనివల్ల కంట్లో ఉండే మలినాలు పోయి కళ్ళు బాగా కనిపిస్తాయి.
6. కళ్ళకు వేసుకున్న మేకప్ ని పడుకునే ముందు తప్పని సరిగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే కళ్ళు నల్లగా అవటమే కాకుండా ఇంఫెక్షన్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.