Dieting Chesthunnara Jagrattha

డైటింగ్ చేస్తున్నారా?... జాగ్రత్త ...

డైటింగ్ చేస్తున్నారా!.. గుండెపోటు వచ్చే ప్రమాదం.

 

* ప్రస్తుతం యువత, పెద్దలు నాజూకుగా కనపడేందుకు డైట్ కంట్రోల్ పేరిట సరైన

ఆహారాన్ని సమపాళ్ళలో తీసుకోకపోవడం వలన వారిలో గుండెపోటు, మధుమేహం,

క్యాన్సర్‌లాంటి వ్యాధులబారిన పడుతున్నారని సాన్ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా

విశ్వవిద్యాలయం, మిన్నెసొటా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు.

 

* ఎవరైతే శరీరానికి కావలసిన పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోకుండా డైట్ కంట్రోల్

చేస్తూ క్యాలరీలను తక్కువగా తీసుకుంటుంటారో అలాంటి వారి శరీరంలో ఒత్తిడి ఎక్కువగా

పెరిగిపోతుందని తాము నిర్వహించిన ఓ పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు

వెల్లడించారు.

 

* ఒత్తిడి పెరగడంతోపాటు శారీరక బరువు సునాయాసంగా పెరిగిపోతున్నట్లు పరిశోధకులు

పేర్కొన్నారు. డైటింగ్ కంట్రోల్ చేయడం వలన మానసకిపరమైన అనారోగ్యం

ఎర్పడుతుందని, దీంతో మానసికపరమైన ఒత్తిడి నెలకొంటుంది.

 

* బరువు తగ్గాలని డైట్ కంట్రోల్ చేస్తుంటే పలు వ్యాధులను ఆహ్వానించినట్లేనని

పరిశోధకులు తెలిపారు. ఆరోగ్యాన్ని మరింతగా పెంపొందించుకోవాలనుకుంటే

సమపాళ్ళల్లో తగినంత ఆహారం సేవిస్తుండాలని వారు సూచించారు.

 

* బరువు తగ్గాలని ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంటే ఒత్తిడి దీర్ఘకాలికంగా

ఉంటుంది. ఇలాంటి ఒత్తిడి వలన కరోనరీ గుండె జబ్బు, అధిక రక్తపోటు, మధుమేహం,

క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

 

* ఆహార నియంత్రణను పాటిస్తుంటే ఒత్తిడి తప్పదని, ఇలాంటి సమయంలో కోలుకోలేని

జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని తమ పరిశోధనల్లో తేలిందని వారు తెలిపారు.