Definition of Yoga

యోగ అంటే అదృష్టం, కూడిక, కలయిక, సంబంధం, ధ్యానం, ఇలా ఎన్నో అర్థాలు యోగకు ఉన్నాయి.

అదృష్టం అను అర్థంలో యోగ శబ్దాన్ని వాడుతూ యోగం బాగుండటం వల్ల ఇంతవాడు

అంతవాడు అయినాడని అంటూ ఉంటారు పెద్దలు.

 

కూడిక అను అర్థంలో యోగ శబ్దాన్ని వాడుతూ ఒకటి ప్రక్కన సున్నా చేరిస్తే పది, పది

ప్రక్కన ఆరు చేరిస్తే పదహారు, నాలుగు నాలుగు కలిపితే ఎనిమిది, ఎనిమిది అయిదు

కలిపితే పదమూడు అని అనడం మనకు తెలుసు.

 

కలయిక లేక సంబంధం అను అర్థంలో యోగ శబ్దాన్ని వాడుతూ తల్లి - కొడుకు, తల్లి -

కూతురు, తండ్రి - కొడుకు, తండ్రి - కూతురు, భార్య - భర్త, అత్త - కోడలు, గురువు -

శిష్యుడు అని అంటూ వుంటారు.

 

మరికొంచెం మనం ముందుకు వెళ్లి ఆత్మ - పరమాత్మల కలయిక కోసం చేసే

ప్రయత్నాన్ని ధ్యానం అని అంటారు. ఇది ఏకాగ్రతపై ఆధారపడి ఉంటుంది. దీనికి

విశ్వాసం, నమ్మకం చాలా అవసరం.

 

యోగ శాస్త్రంలో ధ్యానం ఒక ప్రధానమైన అంశం. ధ్యానం దేని కోసం అని అడిగితే ఆత్మ

పరమాత్మల కలయిక లేక ఆత్మ సాక్షాత్కారం కోసం అని సమాధానం లభిస్తుంది మనకు.

ఇది సాధ్యమా అని అడిగితే చిత్త ప్రవృత్తుల్ని, ముఖ్యంగా కామ, క్రోధ, లోభ, మోహ, మద,

మాత్సర్యాల్ని జయించగలిగితే సాధ్యమేనని సమాధానం లభిస్తుంది.

 

యోగ శాస్త్ర ప్రణేత పతంజలి మహర్షి మాటల్లో యోగాశ్చిత్త వృత్తి నిరోధ: అంటే చిత్త

ప్రవృత్తుల నిరోధమే యోగ అన్నమాట.