నెలలు నిండుతున్న ఉద్యోగానికి సెలవు పెట్టకపోతే మీ కడుపులోని బిడ్డకి హాని చేసిన వారవుతారు అంటూ హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఎనిమిది నెలలు తర్వాత ఉద్యోగాలు వృత్తి పనులు మానుకోవడమే మేలని పరిశోధనల్లో తేలిందట.అలా వెళితే లోపల బిడ్డ ఎదుగుదల నెమ్మదిస్తుందని, బరువు తగినంత పెరగరని ఎసెక్స్ విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. పుట్టినపుడు బిడ్డ బరువు వారి ఆరోగ్యం ఎదుగుదలపై చాలా ప్రభావాన్నిచూపిస్తుంది. కాబట్టి బిడ్డ ఆరోగ్యంగా మంచి బరువు తో పుట్టాలంటే గర్భం ధరించిన తరవాత ఎనిమిది నెలలకు ముందే సాధ్యమైనంత త్వరగా సెలవు తీసుకోవటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు.