ఫేస్‌బుక్ సీఓఓ ఎవరో తెలుసా
షెరిల్ శాండ్‌బెర్గ్.. ప్రస్తుతం ఫేస్‌బుక్ ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సిఒఒ)గా వున్న షెరిల్ శాండ్‌బర్గ్ గతంలో కూడా ఎన్నో ఉన్నతమైన సంస్థలలో పనిచేశారు. గూగుల్‌లో గ్లోబల్ ఆన్‌లైన్ సేల్స్, ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా, ప్రపంచ బ్యాంకులో ఆర్థికవేత్తగానూ, మెకిన్సే అండ్ కంపెనీలో మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ గానూ శాండ్‌బర్గ్ పనిచేశారు. బిల్‌క్లింటన్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న కాలంలో అమెరికా ఖజానా విభాగం చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఆమె పని చేశారు. 44 ఏళ్ల షెరిల్ వాషింగ్టన్ లో పుట్టి, హ్యార్డ్‌వర్డ్ లో ఎకానామిక్స్ లో పట్టా పుచ్చుకున్నారు. చిన్నప్పటి నుంచి చదువుల్లో ఎప్పుడూ ముందే వుండే శాండ్‌బర్గ్ కాలేజీ చదువుల్లోను ఎంతో ప్రతిభ కనబర్చారు.
ఐదు రోజుల పర్యటన నిమ్మిత్తం ఇండియాకు వచ్చారు. భారత ప్రధాని మోడీని కూడా కలుసుకున్నారు. ఈ సందర్భంగా భారత్‌తో తనకు గల అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. 1981లో ప్రపంచబ్యాంకు లెప్రసీ ప్రోగ్రామ్‌లో భాగంగా తొలిసారి ఆమె భారత్‌లో పని చేశారు. గత ఇరవై ఏళ్లలో భారత్ ఎంతో మారిపోయిందని ఆమె అన్నారు. ఇప్పుడు భారత్‌కు కుష్ఠువ్యాధి ఏ మాత్రం ముప్పు కాదన్నారు. భారత్ అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నదని, ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగల సత్తా వున్న దేశమని ఆమె అన్నారు.
ఎంతో పవర్‌ఫుల్ షెరిల్ :
పార్చూన్ మ్యాగజైన్ రూపొందించిన అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళా వ్యాపారవేత్తల జాబితాలో పలుమార్లు ఆమె చోటు దక్కించుకున్నారు.
వాల్‌స్ర్టీట్ జర్నల్ రూపొందించిన వుమన్ టు వాచ్ 2007 జాబితాలోనూ ఆమె స్థానం దక్కిచుకున్నారు.
ఫోర్బ్స్ రూపొందించిన 2014 మోస్ట్ పవర్‌ఫుల్ వుమెన్ జాబితాలో తొమ్మదవ స్థానాన్ని పొందారు. ఈ జాబితాలో మిషెల్ ఒబామా 8 వ స్థానంలో నిలిచారు.
శాండ్‌బర్గ్, నెల్ స్కోవెల్ తో కలిసి రాసిన పుస్తకం లీన్ ఇన్-వుమన్, వర్క, అండ్ ద విల్ టు లీడ్. మిలియన్ కాపీలు అమ్ముడయిన ఈ పుస్తకం ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయిన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది.
