హుందాగా ఉండే దుస్తులు, చక్కటి గాజులు చేతులకు కొత్త సొగసులు తెచ్చిపెడతాయి. మరి అందమైన చేతులు ఇంకాస్త మెరవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దామా..!
1. తరచూ స్క్రబ్‌తో రుద్దుకుని మృతకణాలను తొలగించాలి. స్నానం ముగించాక మొక్కజొన్న పిండిని చేతులకు రుద్దితే చర్మం మృదువుగా మారుతుంది.
2. బయటకు వెళ్లే ముందు చేతులకు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి.
3. హెర్బల్ నూనెలతో వారానికి రెండుసార్లు మర్ధనా చేయాలి.
4. రెండు కప్పుల నీళ్లకు ఓ కప్పు ఆలీవ్ ఆయిల్ జోడించి, 10 నిమిషాలు మరిగించాలి. ఆ నీరు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతులను అరగంట ఉంచి, పొడి టవల్‌తో సున్నితంగా తుడిచి మాయిశ్చరైజర్ రాయాలి.
5. నాలుగు చెంచాల వెన్నకు రెండు చెంచాల తేనె కలిపి చేతులకు మర్దనా చేయాలి. రోజూ రాత్రి పడుకునేముందు ఇలా చేస్తే చర్మం మెత్తబడి చేతులు అందంగా ఉంటాయి.
6. గుడ్డులోని తెల్లసొనకు 2 చెంచాల వెనిగర్, వంటనూనె, నిమ్మరసం, 4 చుక్కల రోజ్‌వాటర్ కలిపి చేతులకు పట్టించాలి.
ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చేతులు కోమలంగా మారుతాయి.