* ఎండు తులసి ఆకు పొడిని పౌడర్‌లా రోజూ ముఖానికి పట్టిస్తే, ముఖం సౌందర్యవంతంగానూ, కాంతివంతంగానూ మారుతుంది. ఈ పొడి ముఖం మీద ఉండే పలుచనివే కాదు గాఢమైన మచ్చల్ని కూడా తొలగిస్తుంది.
* రోజూ కొన్ని తులసి ఆకుల్ని తినడం వల్ల రక్త శుద్ధి అవుతుంది. అలాగే తులసి పొడికి కొన్ని నీటి చుక్కలు కలిపిగానీ, పచ్చి తులసి ఆకులను నూరి గానీ, ఒక పేస్ట్‌లా ముఖానికి పట్టిస్తే, అక్కడున్న గుంటల్లో నిలిచిపోయిన అతి సూక్ష్మమైన మలినాలు సైతం తొలగిపోయి ముఖం సహజ లావణ్యాన్ని సంతరించుకుంటుంది.
*ముఖం తాజాగా ఉండడానికి , ఏదైనా పాత్రలో కాసిని మంచి నీళ్లు తీసుకుని, అందులో సగం నిమ్మకాయ రసాన్ని పిండాలి. అందులో ఓ పిడికెడు తులసి ఆకులు, పిడికెడు మెంతెం ఆకులు వేసి కాసేపు మరగించాలి. జత్తును టవల్‌తో కట్టేసుకుని ముఖానికి మాత్రమే ఆ ఆవిరి పట్టాలి. కొన్ని నిమిషాల తరువాత చన్నీళ్లతో ముఖం కడిగేసుకుంటే ముఖం తాజాగా మెరిసిపోతుంది.
* ముఖం మీద నల్లటి మచ్చలు ఉన్నవారు, నిమ్మరసం లేదా అల్లం రసం కలిపిన తులసి పేస్టును ముఖానికి పట్టించి అది ఎండిపోయిన దాకా అలాగే ఉంచాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేస్తే మచ్చలు తొలగిపోవ డంతో పాటు ముఖం కాంతి వంతంగా, అంద ంగా మారుతుంది.