పసిపిల్లలు ఏడవకుండా మనం తీసుకోవలసిన చిన్న చిన్న జాగ్రత్తలు :
పిల్లలు తమ బాధలు ఏడవటం ద్వారానే మనకి తెలియజేస్తారు
పిల్లలు ఏడ్వటానికి కొన్ని కారణాలు:
ఆకలిగా ఉండటం, భయపడటం, దాహం వేయడం, డయపర్ తడి కావడం వాతావరణం మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండటం, పెద్ద పెద్ద శబ్దాలు కావడం కాంతి ఎక్కువ కావడం, పొగలు కమ్ముకోవడం, తీవ్రమైన నొప్పి ఉండటం, పళ్ళు రావడం, ఇన్‌ఫెక్షన్‌లు, కడుపు నొప్పి (ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్) జ్వరం, జలుబు, చెవినొప్పి మెదడువాపు జ్వరం గుండె సమస్యలు
జాగ్రత్తలు :
* పిల్లల్లో వింత శబ్ధాలు ఏమైనా వస్తున్నాయోమో చూడండి. అంటే శ్వాస సరిగా తీసుకోలేక ముక్కులో, గొంతులోంచి ఎటువంటి శబ్దం వినిపించినా... అజీర్ణం వల్ల వచ్చే యూట్రస్ శబ్ధం.
* నిద్రపుచ్చడానికి వీలైనంత వరకు చుట్టూ పక్కల శబ్ధంలేకుండా జాగ్రత్తపడాలి. పిల్లలు నిద్రించే టైంలో వాషింగ్ మెషిన్లు, టీవీలు, మిక్సీలు ఆన్ చేయకపోవడమే ఉత్తమం.
* పిల్లలను ఎత్తుకోవడం ,లేదా వాళ్లని పొట్టమీద పడుకోబెట్టడం, తేన్పు వచ్చేలా చేయడం తో ఏడుపు మాన్పించొచ్చు.
* బేబీ ఆయిల్ లేదా క్రీమ్స్ తో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల రిలాక్స్ అవుతుంది.
* గోరువెచ్చని నీటితో రోజులో ఒకటికి రెండు సార్లు స్నానం చేయించాలి.
* కొన్ని సందర్భాల్లో అప్పుడే పాలు పట్టినా కూడా ఏడవడం మాత్రం మానరు అటువంటప్పుడు వాటిర నోటికి శుభ్రపరిచిన ఖాలీ బాటిల్ సక్కింగ్ కోసం ఇవ్వాలి.
ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు పాటించినా కూడా మరీ ఎక్కువగా ఏడుస్తుంటే తప్పకుండా మీ పిల్లల డాక్టర్‌కు చూపించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.