మీ బుజ్జాయి బాడీ మసాజ్ కోసం బెస్ట్ ఆయిల్స్ ఎంపిక..
పిల్లల సంపూర్ణ వికాసానికి తల్లిపాలు ఎంత అవసరమో వారి ఆరోగ్యానికి శరీర మర్దన కూడా అంతే అవసరం. వయసు ఏదైనా సరే శరీరానికి చేసే ఆయిల్ మాసాజ్ ఎన్నో మంచి ఫలితాలనిస్తుంది. అలసట, బడలికలను దూరం చేసి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. మాసాజ్ వలన ఎముకలు గట్టిపడతాయి. శరీరానికి బలం చేకూరుతుంది. పిల్లలకు చిన్నప్పటి నుండే నరాలకు బలం కలిగి వారిలో రోగ నిరోధక వ్యవస్ధ పటిష్టమవుతుంది. సాధారణంగా పిల్లలకు వచ్చే వర్షాకాల జలుబులు, దగ్గులు వంటివి కూడా దరిచేరకుండా వుంటాయి. పిల్లలు ఎంతో హాయిగా, హుషారుగా, ఆరోగ్యంగా ఉంటారు. శరీర వికాసంతోపాటు బుద్ధి కూడా వికసిస్తుంది. మసాజ్ చేసిన తర్వాత పిల్లలు హాయిగా నిద్రించటం మన ఇండ్లలో గమనిస్తూనే వుంటాం.. అన్నిటిని మించి మసాజ్ చేసే తల్లి మమతానురాగాల స్పర్శ పిల్లలకు పూర్తి రక్షణ నిస్తుంది. తల్లి ప్రేమపూర్వక పెంపకంలో పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదుగుతారు.
పిల్లలకు శారీరక మర్దన తల్లి చేయటమే ఎంతో మంచిది. వేరెవరైనా అయితే, వారి చిన్నిపాటి శరీరాలకు మర్దనా బలం ఎక్కువ, తక్కువలయ్యే అవకాశం కూడా వుంది. తల్లి మమతే పిల్లలకి కొండంత బలం. వారిది విడదీయరాని అనుబంధం. తల్లినుంచి పిల్లలు ఎంతో నేర్చుకుంటారు. పిల్లల నడవడికకు తల్లే ఆదర్శం మార్గదర్శి. అయితే, పిల్లల చర్మం ఎంతో సున్నితంగా వుంటుంది. మాసాజ్ కు వాడే ఆయిల్ ఎంతో నాణ్యతలతో కూడుకున్నదై వుండాలి. ఇది శరీరంలోకి ఇంకి ప్రతి కణాన్ని ఉత్తేజపరచేలా వుండాలి. నేడు మార్కెట్ లో లభ్యమవుతున్న బేబీ ఉత్పాదనలలో బేబీ ఆయిల్ కూడా వుంటుంది. బేబీకి ఏది వాడినప్పటికి నాణ్యతా ఉత్పత్తులే వాడి చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో శ్రధ్ధ వహించండి. అందుకు మీ బేబీ బాడీ మసాజ్ కు ఉపయోగించేటటువంటి కొన్ని నూనెల ఎంపిక మీ కోసం...
1. వెజిటేబుల్ లేదా ప్లాంట్ ఆయిల్: ఈ నూనెలో బేబీ చర్మంలోనికి చర్మ రంధ్రాల ద్వారా శోషించబడతాయి కాబట్టి కొంత మంది ఎక్సపర్ట్స్ మీ బేబీ మసాజ్ కు ఈ ఆయిల్స్ ను వాడమని సలహా ఇస్తుంటారు. ఈ నూనెలో సులభంగా జీర్ణం అవుతాయి. కాబట్టి ఆయిల్ మసాజ్ చేసే సమయంలో మీ బేబీ వెళ్ళను నోట్లో పెట్టుకొని చుంబిస్తుందనే భయం అవసరం లేదు.
2. కొబ్బరి నూనె: ఇది చాలా ఆదర్శవంతమైన మరియు అత్యంత సాధారణంగా ఉపయోగించే మసాజ్ ఆయిల్. గోరివెచ్చిని కొబ్బరి నూనెతో బేబీకి మసాజ్ చేయడం వల్ల బేబికి ఓదార్పు కలుగుతుంది. మరియు బేబీ చర్మం, జుట్టు మరియు ఎముకలకు మేలు చేస్తుంది. చాలా మంది ఈ నూనెను పిల్లల బాడీ మసాజ్ కు వేసవిలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
3. ఆవాల నూనె(మస్టర్డ్ ఆయిల్): ఈ నూనెను చాలా ఇల్లలో చాలా మంది బాడీ మసాజ్ కు తరచూ వినియోగిస్తుంటారు. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాదు, ఎముకలకు బలాన్ని అందిస్తుంది. ఇంకా జలుబు దగ్గు నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. శీతాకాలంలో ఈ నూనెతో బేబీకి బాడీ మసాజ్ చేయడానికి సూచిస్తుంటారు. ఈ వెచ్చని మస్టర్డ్ ఆయిల్ తో బేబీ బాడీ మసాజ్ చేయడం వల్ల శరీరం మీద కేశాలు రాకుండా నిరోధిస్తుంది. అతి చిన్న వయస్సులోనే బేబీ చెస్ట్, కాళ్ళు, చేతుల మీద అనవసరంగా వచ్చే కేశాలను నిరోధిస్తుంది.
4. ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది. మీ బేబీకి హెయిర్ గ్రోత్ తక్కువగా ఉన్నట్లైతే ఆలివ్ ఆయిల్ తో తలకు బాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన అరగంట తర్వాత తలస్నానం చేయించాలి. ఇంకా బేబీ కను బొమ్మల చక్కటి ఆక్రుతి కోసం ఈ ఆయిల్ ను కనుబొమ్మల మీద మర్ధన చేయవచ్చు. మీ బేబీ బాడీ మసాజ్ కోసం ఈ బెస్ట్ మసాజ్ ఆయిల్ ఎంపికచేసుకొంటే బేబీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శరీరం మీద ఎటువంటి రాషెస్ దద్దుర్లు ఉన్నాకూడా ఈ ఆయిల్ మసాజ్ వల్ల నివారించబడుతాయిప. బేబీకి ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు ఎటువంటి హాని జరగకుండా మీ చేతి గాజులు, ఉంగరాలు మరియు ఇతర ఆభరణాలను తొలగించండి