* ఏరోబిక్ వ్యాయామం మొదలు పెట్టే ముందు అప్పటి వరకు చేస్తున్న వ్యాయామాన్ని, ఆరోగ్యస్థితిని, బరువును దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు పాటించాలి. ఏరోబిక్ వ్యాయామం ద్వారా లభించే ప్రయోజనాలను పొందాలంటే కనీసం 12 వారాల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
* ఏరోబిక్ వ్యాయామం వల్ల శరీరంలో పేరుకొన్న అదనపు కొవ్వులను కరిగిస్తుంది. అలసటను తగ్గిస్తుంది మరియు స్టామినాను పెంచుతుంది.
* ఏరోబిక్ వ్యాయామం వల్ల మధుమేహం వలన వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
* గుండె పనితీరులో మెరుగుదల ఉంటుంది. శరీర కండరాల బలానికి తోడ్పడుతుంది.
* క్రమం తప్పని ఏరోబిక్ వ్యాయామాలు అధిక రక్తపోటును తగ్గించడమేకాదు, అసలు అధిక రక్తపోటు రాకుండా నిరోధిస్తాయి.
* శ్వాస సంబంధ సమస్యల నివారిణిగా, ఆక్సిజన్‌ను తొందరగా గ్రహించేవిధంగా శరీర స్ధాయిని పెంచుతుంది.