Lung Cancer Treatment

లంగ్ క్యాన్సర్ - జాగ్రత్తలు

లంగ్ క్యాన్సర్ అనేది క్యాన్సర్ వలన చనిపోయే కారణాలలో ప్రముఖమైనది. ఏ క్యాన్సర్

అయినా ముందుగా సూక్ష్మ పరిమాణంలోనే మొదలవుతుంది. అది పెరిగి పెరిగి

నిర్దిష్టమైన పరిమాణానికి చేరే వరకు గుర్తించడం కష్టమే. ఎందుకంటే మనం చేసే

పరీక్షలన్నీ క్యాన్సర్ కణితి పరిమాణాన్ని బట్టి గుర్తించేవిగా ఉంటాయి.

 

నాలుగు దశలు..

లంగ్ క్యాన్సర్‌ను నాలుగు దశలుగా విభజించారు. రెండో దశ కంటే ముందుగానే మనం

దీన్ని కనుక్కోగలిగితే నయం చేయగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం

అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రెండో దశ క్యాన్సర్లన్నింటినీ

నయం చేయగలిగే మందులు కనుగొనే అవకాశం లేదు. సాధారణంగా లంగ్ క్యాన్సర్‌ను

ముందుగా కనుక్కోవడానికి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. అవి.. ఛాతీ ఎక్స్‌రే, కళ్ళె సైటాలజీ,

స్పైరల్ కంప్యూటర్ టోమోగ్రఫీ. ఈ పరీక్షల ద్వారా క్యాన్సర్‌ను కనుక్కోగలిగే శాతం ఎంత?

దాని వలన కలిగే ఉపయోగాలు ఇక్కడ ముఖ్యం కాదు. అసలు లంగ్ క్యాన్సర్ బారిన

పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

 

"రేడాన్ అనేది రాళ్ళలోను, మట్టిలోను యురేనియం విచ్ఛిన్నం కావడం వల్ల

ఏర్పడుతుంది. ఈ రేడాన్ గ్యాస్ మోతాదు ఇళ్ళలోను, ఇతర భవనాలలో అధికంగా ఉండి,

ఆ గ్యాస్‌ను పీల్చడం వలన లంగ్ క్యాన్సర్ వస్తుంది. ముఖ్యంగా సెల్లార్‌లలో, అండర్‌గ్రౌండ్

బిల్డింగ్‌లలో దీని మోతాదు ఎక్కువ..'' రాకుండా ఉండాలంటే.. లంగ్ క్యాన్సర్ రాకుండా

ఉండాలంటే రిస్క్ ఫ్యాక్టర్స్‌కు ఆమడ దూరంలో ఉండాలి. ధూమపానం, సెకండ్‌హ్యాండ్

స్మోక్, పర్యావరణానికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్ల నుంచి రక్షణ పొందాలి. ఆల్కహాల్‌ను

సేవించకూడదు.

పర్యావరణ రిస్క్‌ఫ్యాక్టర్లు : రేడాన్ ఎక్స్‌పోజర్ - రేడాన్ అనేది రాళ్ళలోను, మట్టిలోను

యురేనియం విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడుతుంది. ఈ రేడాన్ గ్యాస్ మోతాదు

ఇళ్ళలోను, ఇతర భవనాలలో అధికంగా ఉండి, ఆ గ్యాస్‌ను పీల్చడం వలన లంగ్ క్యాన్సర్

వస్తుంది. ముఖ్యంగా సెల్లార్‌లలో, అండర్‌గ్రౌండ్ బిల్డింగ్‌లలో దీని మోతాదు ఎక్కువగా

ఉంటుంది.

గాలి కాలుష్యం : గాలి కాలుష్యానికి లంగ్ క్యాన్సర్‌కు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది.

కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాలలో నివసించే వారికి ఈ రకం క్యాన్సర్ వచ్చే

అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.ఇక, ఇతర పర్యావరణ కారకాలలో.. ఆస్‌బెస్టాస్,

ఆర్సెనిక్, క్రోమియం, నికెల్, తారు, తారు పొగ వంటివి ఉంటాయి. వీటన్నింటికీ

సాధ్యమైనంత దూరంగా ఉండడం వల్ల లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

 

ఆల్కహాల్, ధూమపానం : ఆల్కహాల్ పుచ్చుకోవడం, ధూమపానం వల్ల క్యాన్సర్ వచ్చే

అవకాశాలు మరింత పెరుగుతాయి. లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలనుకున్న

వారు ధూమపానం, మద్యపానం వంటివి చేయకూడదు. ఈ అలవాట్లు ఉన్న వారు తక్షణం

మానివేయాలి. ధూమపానం నుంచి బయటపడడానికి పల్మనాలజిస్ట్ ఇచ్చే కౌన్సెలింగ్,

మందులు ఉపయోగపడతాయి. పోషకాహారం కూడా.. క్యాన్సర్ నిరోధంలో పోషకాహారం

కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఎక్కువగా తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.

అలాగే ప్రతి ఒక్కరు శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కొంతమంది విటమిన్-ఇ

తీసుకుంటే లంగ్ క్యాన్సర్ రాదు అనుకుంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు.

అంతేకాదు, ధూమపానం చేసే వారు కెరోటినాయిడ్స్ ఎక్కువగా తీసుకుంటే లంగ్ క్యాన్సర్

వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.