జీర్ణక్రియ :

జీర్ణక్రియ ప్రాధాన్యత అందరకు తెలిసిందే. సాధారణంగా భోజనం తర్వాత చాలామంది జీలకర్రను ఎంతో కొంత మొత్తంలో నోటిలో వేసుకొని చప్పరించటం చూస్తూ వుంటాం. తిన్న పదార్ధాలకు జీర్ణక్రియ బాగా జరగాలంటే, అజీర్ణం వంటివి ఏర్పడకుండా వుండాలంటే, ఈ జీలకర్ర తినటం ఎంతో మేలు చేస్తుంది. పొట్టనొప్పి, అజీర్ణం, డయోరియా, వాంతి వికారం, మార్నింగ్ సిక్ నెస్ వంటి అనారోగ్యాలకు జీలకర్రను బాగా వేయించి కొద్దిగా ఉప్పు కలిపి తినటం చేస్తారు.

మహిళలలో వచ్చే అపసవ్య రుతుక్రమాలకు జీలకర్ర చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. మొలలు బాధిస్తున్నాయా? అయితే జీలకర్ర తగుమాత్రంగా ప్రతిరోజూ తీసుకోండి. దీనిలో వుండే పీచు పదార్ధం ఎంతో మలబద్ధకాన్ని పోగొడుతుంది. నేటికి విరేచనం సాఫీగా జరగాలంటే మనదేశంలోని చాలా ప్రాంతాలలో జీలకర్రను ఉప్పుతో కలిపి తినటం చూస్తూనే వుంటాం.

జీలకర్ర ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఎలా వుంటాయనేది గమనిస్తే....

సాధారణ జలుబు :

జీలకర్రలో వుండే యాంటీ సెప్టిక్ గుణాలు ఫ్లూ లేదా సాధారణ జలుబును తగ్గించేందుకు బాగా తోడ్పడతాయి. ఇది మీలోని రోగ నిరోధకతలను మెరుగుపరుస్తుంది. ఒక కప్పు వేడి నీటిలో జీలకర్ర, అల్లం, తులసి ఆకులు వేసి బాగా మరిగించి ఆ మిశ్రమానికి కొద్దిపాటి తేనె కలిపి తాగితే, జలుబు వెంటనే తగ్గుతుంది.

రక్త హీనత :

జీలకర్ర విత్తనాలలో ఐరన్ అధికం. ఆక్సిజన్ శరీరంలోని భాగాలకు బాగా అందాలంటే రక్తం ఎంతో అవసరం. మరి ఆ రక్తంలో వుండే హెమోగ్లోబిన్ ఏర్పడాలంటే ఐరన్ కావాలి. జీలకర్రలో ఐరన్ పుష్కలంగా వుంటుంది. రక్తహీనత లేదా ఎనీమియా ఏర్పడిన వారిలో రక్తంలో తక్కువస్ధాయిలో హెమోగ్లోబిన్ వుంటుంది. ప్రత్యేకించి మహిళలు, పిల్లలు, టీనేజ్ పిల్లలలో ఈ పరిస్ధితి వస్తుంది. వీరికి ప్రతిరోజూ జీలకర్ర వంటకాలలో కలిపి అంటే, పరోటాలు, చపాతీలు, కూరలు, సూప్ లు, రైస్, వంటి తిండ్లలో కలిపి తినిపిస్తే రక్తహీనతనుండి వీరు దూరం అవుతారు.