
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు' (Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-116లో.. ప్రీతి, కృష్ణజ, భవిత, రోహిత్ అందరికి సెమిస్టర్ రిజల్స్ వస్తాయి. ఒక్కొక్కరుగా గీతాంజలికి చూపిస్తుంటారు. మొదటగా కృష్ణజ తన మార్కులు చూపించగా అన్నింట్లో మంచి మార్కులే వస్తాయి. ఒకటి రెండింట్లో తొంభై ఎనిమిది, తొంభై ఏడు రావడంతో .. నెక్స్ట్ టైమ్ వందకి వంద శాతం రావాలని గీతాంజలి చెప్పడంతో సరేనంటుంది కృష్ణజ. ఆ తర్వాత ప్రతీ వచ్చి తన మార్కులు చూపిస్తుంది. ఒక్కదాంట్లో తొంభై వస్తుంది. మిగతా వాటిల్లో తొంభై అయిదు, తొంభై ఆరు అలాగా రావడంతో ఇంకా బాగా చదవాలని గీతాంజలి అంటుంది.
ఇక రోహిత్ తన మార్కులు చూపిస్తాడు. అతనికి ఒక్కదాంట్లో యాభై శాతం మార్కులు రాగా , మిగతా వాటిల్లో అరవై , డెబ్బై శాతమే వస్తాయి. ఇంత తక్కువ ఎందుకు వచ్చాయని రోహిత్ ని కోప్పడుతుంది గీతాంజలి. సారీ మమ్మీ.. ఫస్ట్ ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ టైట్ గా ఉంది. అందుకే మిగతా ఎగ్జామ్స్ కూడా అంతగా రాయలేదని రోహిత్ చెప్పగా స్పెషల్ కేరింగ్ తీసుకొని చదవమని గీతాంజలి చెప్పగా సరేనని రోహిత్ అంటాడు.
ఆ తర్వాత భవిత తన మార్కులు చూపిస్తుంది. అన్నింట్లో యాభై శాతం కన్నా తక్కువగా వస్తాయి. ఏంటి ఇది అని గీతాంజలి అడుగగా నాకు చదవు అబ్బడం లేదు. నా మైండ్ కి చదువు ఎక్కడం లేదు.. నాకు ఇంట్రస్ట్ లేదని భవిత అనగానే తన చెంపచెల్లుమనిపిస్తుంది గీతాంజలి. చదువు మానెయ్.. చదువు మానేసి మెకానిక్ , క్లీనర్, క్లర్క్, ఇలాంటివి చేస్తావా బుద్దిగా చదువుకో అని గీతాంజలి అనగానే నాకు ఇంట్రస్ట్ లేదని భవిత చెప్తుంది. నాకు పెళ్ళి చేసి పంపించేయమ్మ.. పెళ్ళి చేసుకొని సెటిల్ అయిపోతా అని భవిత అనగానే గీతాంజలి, భాను సీరియస్ అవుతారు. ఇక నుండి నిన్ను నేను చదివిస్తాను.. స్పెషల్ కేరింగ్ తోసుకొని చదివిస్తాను.. చదువు ఎలా రాదో నేను చూస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది.
మరోవైపు హాస్టల్ లో ఉన్న రాకీ సిగరెట్ కోసం గది మొత్తం వెతుకుతాడు. ఇక ఎలాగోలా వెతికి సిగరెట్ తాగుతుంటే అప్పుడే మనీష్ హాస్టల్ కి వస్తాడు. దాంతో వెంటనే గదిలోకి వెళ్ళి చదివినట్టుగా యాక్ట్ చేస్తాడు. అప్పుడే రాకీ దగ్గరికి మనీష్ వచ్చి గుడ్ బాగా చదువుకో.. అయితే నువ్వు హాస్టల్ లోనే బాగా చదువుతావని మనీష్ అంటాడు. ఖర్చులకి డబ్బులు కావాలా అని మనీష్ అడుగగా వద్దని రాకీ అంటాడు. ఆ తర్వాత బాగా చదువుకోమని చెప్పి మనీష్ వెళ్ళిపోతాడు.
ఇక దీపావళి హాలిడేస్ కు హాస్టల్ గదిలోని వాళ్ళంతా వెళ్తారు. హాలిడేస్ గురించి మాట్లాడి ఇంటికి వెళ్దామని అనుకొని రోహిత్ కి కాల్ చేస్తాడు రాకీ. కానీ అక్కడ అంజలి ఉండటంతో రోహిత్ కాల్ లిఫ్ట్ చేయడు. రాకీ మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుంటే పక్కకి వెళ్ళి మాట్లాడతాడు రోహిత్. ఇక రాకీతో మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి అంజలి ఉంటుంది. దాంతో వెంటనే తన ఫోన్ స్విచ్చాఫ్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






