
బిగ్ బాస్ తెలుగు సీజన్-10లో పదో వారం ఫ్యామిలీ వీక్‌లో చివరగా వర్షిణి తల్లి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. తల్లిని చూడగానే వర్షిణి ఎమోషనల్ అయిపోయింది. ఇంట్లోకి రాగానే వర్షిణి తల్లి అందరినీ పలకరించి, ముందుగా రామకృష్ణకు క్షమాపణలు చెప్పింది. సారీ అమ్మా అంటూ ఎమోషనల్ అయింది. వర్షిణి బాగా ఆడుతోంది, నామినేషన్లో ఇచ్చి పడేస్తోంది అంటూ కూతురిని పొగిడేసింది. మీరంతా ఒక ఫ్యామిలీలా ఉండండి, మీలో మీరు కొట్టుకోండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అంటూ చెప్పడంతో అందరు నవ్వేశారు.
ఆ తర్వాత వర్షిణి తల్లి కాళ్లకు వర్షిణి నమస్కారం పెట్టింది. ఇదే సమయంలో ముఖేష్ గురించి వర్షిణి తల్లి ఏదో చెప్పబోయింది. వర్షిణికి ఇలా కాళ్లు మొక్కడం అలవాటు అంటూ ముఖేష్ గురించి సీక్రెట్ చెప్పబోయింది. వెంటనే వర్షిణి అమ్మ నోరు మూసేసింది. దీంతో ముఖేష్ షాక్ అయ్యాడు. గతంలో వర్షిణి కెప్టెన్ అయిన తర్వాత బాత్రూమ్ ఏరియాలో ముఖేష్ కాళ్లకు నమస్కరించిన విషయాన్ని తల్లి చెప్పబోతోందని అందరూ అనుకున్నారు.
వర్షిణి తల్లి ఎంట్రీతో ఫ్యామిలీ వీక్ పూర్తయినట్టే. అయితే దీనికి ముందు వర్షిణి, రామకృష్ణల్లో ఒకరి తల్లి మాత్రమే లోపలికి రావాలని నాగార్జున ఓటింగ్ పెట్టాడు. హౌస్‌మేట్స్‌లో మెజార్టీ వర్షిణి తల్లికి ఓటు వేశారు. దీంతో రామకృష్ణ తల్లి గార్డెన్ ఏరియాలోనే ఉండిపోయింది. కొడుకును చూసి అక్కడే ఏడ్చేసింది. ఇంతకంటే నేను ఏం చేయలేను అమ్మా అంటూ రామకృష్ణ కూడా ఎమోషనల్ అయ్యాడు.
మొత్తంగా వర్షిణి తల్లి ఎంట్రీ ఎమోషన్‌తో పాటు కాస్త ఫన్‌తో సాగింది. ముఖేష్ కాళ్లు మొక్కిన విషయం బయటపడకుండా వర్షిణి అడ్డుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. మరి వర్షిణి తల్లి మాటలతో వర్షిణి గేమ్‌కి బూస్ట్ వస్తుందా అనేది చూడాలి.






