
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ - 427 లో.. పెద్దసారు దగ్గర వీరు వాళ్లు ఆస్తుల పంపకం టాపిక్ తీసుకొని వస్తారు. అది విని అసలు ఆస్తుల పంపకం నేను ఉండగా జరగదని పెద్దసారు ఖచ్చితంగా చెప్తాడు. ఆ తర్వాత రుద్ర, గంగ ఉన్న అవుట్ హౌస్ దగ్గరికి పెద్దసారు వచ్చి మాట్లాడుతాడు. గంగ చేసిన ఐస్ క్రీమ్ తీసుకొచ్చి పెద్దసారుకి ఇస్తుంది. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.
నాకు నిన్ను చూడనిది ఏదోలా ఉంది రుద్రా, అందుకే కాసేపు మాట్లాడి వెళదామని వచ్చానని రుద్ర పక్కన కూర్చొని ప్రేమగా మాట్లాడుతాడు. వాళ్లు అలా కలిసి ప్రేమగా మాట్లాడుతుంటే గంగ చూసి మురిసిపోతుంది. ఆ తర్వాత రుద్ర, గంగ, రంగా ప్రాక్టీస్ కి వెళ్తారు. విశ్వ, జయ కూడా వస్తారు. జయ, గంగ ప్రాక్టీస్ చేస్తుంటే విశ్వ, రుద్ర మాట్లాడుకుంటారు. గంగ, జయ రన్నింగ్ చేస్తుంటే గంగ పడిపోయేలా జయ కాలు అడ్డుపెడుతుంది. రుద్ర వచ్చి కోప్పడుతాడు. నీతి నిజాయితీ లేని ఆట ఎందుకని అంటాడు.
ఆ తర్వాత విశ్వ ఒక అమ్మాయి ప్రాక్టీస్ చేస్తుంటే దగ్గరికి వెళ్లి నువ్వు ఇంకా లెర్నింగ్ లోనే ఉన్నావా అని అడుగుతాడు. లేదు సార్ ఐ యామ్ ట్రైనర్ అని ఆమె అనగానే ట్రైనర్ అంటే ఇలా ఉంటారా అని ఆశ్చర్యంగా అడుగుతాడు విశ్వ. ఒకసారి వాళ్లని చూడు పంచ్ అంటే అలా ఉండాలని గంగ, జయ ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్లని చూపిస్తాడు. నువ్వు ఇంకా నేర్చుకోవాలని ఆమెకి సలహా ఇస్తాడు. అప్పుడే ఆమె సర్ వస్తాడు, ఏంటి అతను ఏదో అంటున్నాడని అడుగుతాడు. నేను ఇంకా నేర్చుకోవాలి అంట అని ఆమె చెప్తుంది. ఆ విషయం విని విశ్వ దగ్గరికి వెళ్తాడు. నన్ను గుర్తుపట్టారా మీరు కంప్లైంట్ ఇచ్చి నన్ను మేనేజ్మెంట్ నుంచి తొలగించారు కదా అని అతను అంటాడు. విశ్వకి అతనికి చిన్న గొడవ జరుగుతుంది. తను ట్రైనింగ్ ఇస్తున్న జ్యోతికి, విశ్వ ట్రైనింగ్ ఇస్తున్న జయకి పోటీ పెట్టాలనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






