అనసూయ ఒక్క ఛాన్స్...హైట్ చూస్తే కత్తిలా ఉన్నాడు..
on Apr 3, 2025
కిర్రాక్ బాయ్స్ - ఖిలాడీ గర్ల్స్ క్లాస్ రూమ్ ఐతే అందులో స్టూడెంట్స్ ఎలా ఉంటారు అనేది నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ చూపించబోతున్నారు. కాలేజ్ స్పెషల్ థీమ్ లో భాగంగా కొన్ని స్కిట్స్ వేశారు. ఐతే ఇందులో యాదమ్మ రాజు - అనసూయ మధ్య ఒక స్కిట్ నడిచింది. "మీలాంటి అమ్మాయి ఎదురుగా ఉంటే ఒక్క స్టెల్లాని ఏమిటి ఈ ప్రపంచాన్నే ఎదిరిస్తా...ఒక్క చాన్సు ఇస్తే మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా మేడం " అంటూ అనసూయ గురించి ఒక హార్ట్ టచ్చింగ్ డైలాగ్ చెప్పాడు. దానికి అనసూయ ఫిదా ఐపోయింది కానీ తర్వాత ఇంకో డైలాగ్ వేసింది. "సరిపోను రాజు" అంటూ అనసూయ నవ్వేసింది.
ఆ డైలాగ్ కి తేజు మడివాడ ఐతే పడీపడీ నవ్వింది. ఇక మరో వైపు బుల్లితెర నటి డెబ్జాన్ కి ప్రొపోజ్ చేసాడు ఆరుగుడుల అందగాడైన దిలీప్. "ఇలాంటి ఒక అబ్బాయికి లైఫ్ లోకి వస్తే ఆయనకు ఛాన్స్ ఉందా లేకపోతే లేదా" అని శ్రీముఖి అడిగింది. దానికి డెబ్జాన్ ఐతే "ఎందుకు అవకాశం ఉండదు. హైట్ చూస్తే కత్తి లాగా ఉన్నాడు." అని చెప్పేసరికి దిలీప్ కూడా ఫుల్ ఖుషీ ఐపోయాడు దాంతో డెబ్జాన్ ని గిరగిరా అంటూ రొమాంటిక్ గా తిప్పేసాడు. ఇక నెటిజన్స్ ఐతే డెబ్జాన్ పక్క దిలీప్ ని ఒప్పుకోవడం లేదు. డెబ్జాన్ పక్కన నిరంజన్ కరెక్ట్ ఆయన తప్ప ఆమె పక్కన ఎవరూ సూట్ కారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. డెబ్జాన్ - నిరంజన్ కలిసి "ఎన్నెన్నో జన్మల బంధం" అనే సీరియల్ లో కలిసి నటించారు. ఈ సీరియల్ తో వీళ్లకు బాగా పేరు కూడా వచ్చింది. మొదట్లో డెబ్జాన్ ఐతే షోస్ కి వచ్చేటప్పుడు తెలుగు రాని కారణంగా అంతగా మాట్లాడేది కాదు. కానీ ఇప్పుడు అన్ని షోస్ లో కూడా వచ్చి రాని తెలుగుతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
