సుధీర్ ఆ ఒక్కటి అడక్కు...ఆర్ అంటే ఎందుకు ఇష్టమో కూడా నాకు తెలుసు
on Apr 3, 2025
హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే రంభ ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. ఏ సినిమాల్లోనూ నటించడం లేదు. ఫామిలీతో పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ కనిపిస్తోంది. ఐతే రంభ ఇప్పుడు బుల్లితెర మీద కనిపించబోతోంది. సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ షోలో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి రంభ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ షోకి ప్రతీ వారం అలనాటి అందాల నాయకులను తీసుకొచ్చి వాళ్లకు సముచిత గౌరవాన్ని అందిస్తోంది. ఇక ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. రంభ రావడంతోనే యాంకర్ రవి పులిహోర కలిపాడు.. ఆర్ ఫర్ రవి , ఆర్ ఫర్ రంభ, ఆర్ ఫర్ రావిషింగ్ అనేసరికి రంభ వెంటనే సెటైర్ వేసింది.
మొన్నటి ఎపిసోడ్ కి రమ్య కృష్ణ వచ్చినప్పుడు ఆర్ ఫర్ రమ్య కృష్ణ, ఆర్ ఫర్ రవి అన్నారు అనేసరికి పరువు పోయింది. ఆర్ తో పేర్లు స్టార్ట్ ఐనా హీరోయిన్స్ మి..మేమేం తప్పు చేసాం ? అని అడిగింది. ఇంతలో సుధీర్ వచ్చి "ఆర్" అంటే ఇష్టం మేడం అనేసరికి "మీకు ఆర్ అంటే ఇష్టం అని తెలుసు అది నాకు గురించి కాదని కూడా నాకు తెలుసు" అనేసరికి సుధీర్ వెంటనే "మీరు అక్కడ కూర్చుంటే మీ దగ్గర" అనబోయాడు. అంతే రంభ వేలు చూపించి "ఆ ఒక్కటి అడక్కు" అని సెటైర్ వేసింది. "నా పేరు రంభ. ఎపిసోడ్ రంజుగా ఉంటుంది" అంటూ ఆ ఎపిసోడ్ లింక్ ని చాల క్యూట్ గా చెప్పేసింది. ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో రంభ " ఆ ఒక్కటి అడక్కు" అనే మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత చిరంజీవితో కలిసి చేసిన "హిట్లర్" మూవీతో ఆమె బాగా పాపులర్ అయ్యింది. దేశముదురు, యమదొంగ మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో కనిపించిన రంభ 2010 తర్వాత సినిమాలకు దూరమై ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఆ వీడియోస్ ని తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేస్తూ ఉంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
