Illu illalu pillalu : పెళ్ళికి ముందే పది లక్షలు అడిగిన శ్రీవల్లి.. భాగ్యం ప్లాన్ అదే!
on Apr 3, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ', ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-122 లో.....భాగ్యం చెప్పినట్టుగా చందుకి శ్రీవల్లి ఫోన్ చేసి మీతో మాట్లాడాలి.. త్వరగా రమ్మని చెప్తుంది సరేనని చందు బయలుదేర్తుంటే సాగర్, ధీరజ్ వచ్చి చందుని ఆటపట్టిస్తారు. ఎక్కడికి వెళ్తున్నావని అడుగగా.. శ్రీవల్లి రమ్మంది ఏదో మాట్లాడాలని చెప్పిందని చందు చెప్తాడు. సరే మేం కూడ వస్తామని సాగర్, ధీరజ్ లు వెళ్ళబోతుంటే అప్పుడే తిరుపతి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారని అడ్డుపడతాడు. శ్రీవల్లి దగ్గరికి అని చెప్పి వెళ్ళిపోతారు.
మరొకవైపు భాగ్యం ఒక ఇంటిని రెంట్ కి తీసుకొని చెక్కు ఇస్తుంది. అతను చెక్కు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ చెక్కు పై సంతకం చూడకుండానే తీసుకున్నాడని భాగ్యం చిన్న కూతురు అంటుంది. వాడు బుర్ర తక్కువోడు కాబట్టే మనకి ఇంటిని ఇచ్చాడని భాగ్యం అంటుంది. నేను చెప్పినట్టు అల్లుడు గారితో మాట్లాడమని శ్రీవల్లితో భాగ్యం చెప్తుంది. అప్పుడే సాగర్, చందు, ధీరజ్ ముగ్గురు వస్తారు. అదేంటీ ఒక్కడినే రమ్మంటే ముగ్గురు వచ్చారని భాగ్యం టెన్షన్ పడుతుంది. ఇక ముగ్గురిని లోపలికి పిలిచి స్వీట్స్ తీసుకొని రమ్మని సాగర్ , ధీరజ్ లని పంపిస్తారు. భాగ్యం తన భర్త కూతురు వెళ్ళిపోతారు. చందు, శ్రీవల్లి ఇద్దరు మాట్లాడుకుంటారు.
మరొకవైపు చందు, శ్రీవల్లీల పెళ్లి పత్రికలో తమ పేర్లు రాసుకొని నర్మద మురిసిపోతుంది. అప్పుడే ప్రేమ వచ్చి అలా ఎందుకు రాసావని అడుగుతుంది. ఇదొక జ్ఞాపకం మనకి ఇలాంటి జ్ఞాపకాలు లెవ్వు.. మన పెళ్లిళ్లు పెద్దవాళ్ళు చేస్తే అన్ని జ్ఞాపకాలు ఉండేవి అని నర్మద ఎమోషనల్ అవుతుంటే ప్రేమ బాధపడుతుంది. అదంతా వేదవతి చూస్తుంది. తరువాయి భాగంలో పెళ్లి ఖర్చుకి డబ్బు కావాలని చందుని శ్రీవల్లి అడుగుతుంది. ఎంత అని చందు అడుగగా పది లక్షలు అని శ్రీవల్లి చెప్తుంది. దాంతో చందు షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
