నిబ్బా, నిబ్బి వేషాలన్నీ వేసా..బ్యాంకాక్ వెళ్ళినప్పుడు మొసలి మాంసం కూడా తినేసా
on Apr 15, 2025
శ్రీసత్య బుల్లితెర మీద అందరికీ తెలిసిన నటి. అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా. ఐతే తనతో చేసిన వాళ్లంతా కూడా మంచి ఇన్కమ్ సంపాదిస్తుంటే శ్రీసత్య మాత్రం ఇంకా ఏమీ సంపాదించుకోలేకపోయింది అని ఫీల అవుతూనే ఉంది. ఐతే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పింది. "19 ఏళ్లకు ప్రేమ , ఎంగేజ్మెంట్ ఐపోయాయి. కానీ ఆ వయసుకు మెచ్యూరిటీ ఉండదు అన్న విషయం తర్వాత తెలిసింది. సినిమాల్లో చూపించినట్టు పచ్చడన్నం అన్నా వేసుకుని తింటాం అంటారు. రియల్ గా అది వర్క్ అవుట్ అవదు. ఆ టైంకి అదే ప్రేమ అనుకుంటాం. ఎం చేయకపోయినా అదే ప్రేమ అని ఫీలవుతాం. కానీ రియాలిటీలో అలా ఏమీ ఉండదు. ప్రేమించడం వరకు ఓకే కానీ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి చాలా జాగ్రత్తగా స్టెప్ వేయాలి.
మంచి పర్సన్ ని చూసుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను కూడా సినిమాలు చూసే పాడైపోయాను. ఆ టైములో సూసైడ్ చేసుకోవడానికి ట్రై కూడా చేశా. అంతా నిబ్బా, నిబ్బి వేషాలు వేసాను. ఐతే నేను ఇష్టం లేదు అని అతను చెప్పాక నేను టు ఇయర్స్ కెరీర్ కి బ్రేక్ ఇచ్చేసా. మా డాడీ హౌస్ అరెస్ట్ చేశారు. మా డాడీకి మా రిలేషన్ అసలు ఇష్టం లేదు. ఇప్పుడు నేను సింగల్ గా చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు పెళ్లి అంటే చాలా భయాలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాగా పెళ్లి చేసుకున్నాక కొన్ని రోజులకు ఇంకో అమ్మాయి నచ్చగానే వెళ్లిపోతున్నారు. పెళ్లి చేసుకుంటే నా హజ్బెండ్ కూడా అలా చేయడన్న గ్యారెంటీ లేదు కదా. అలా అందరూ ఉండరు. లైవ్ ఇన్ రిలేషన్ షిప్ నా దృష్టిలో వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ. లైఫ్ లాంగ్ సింగల్ గా ఉందామనుకుంటున్న కానీ కోరియన్స్ లో మంచి వాళ్ళు దొరికితే చేసుకుంటా. రీసెంట్ గా బ్యాంకాక్ వెళ్ళినప్పుడు లైఫ్ లో అన్ని ట్రై చేయాలి అంటూ గీతూ మొసలి మాంసం తింటూ ఒక ముక్క నాకూ ఇచ్చింది. మొసలి మాంసం తింటావా నువ్వు మా ఇంట్లో పెద్ద గొడవలు ఐపోయాయి. కానీ తినేసాను ఐపోయింది కదా అని చెప్పాడు" అంటూ శ్రీసత్య చెప్పుకొచ్చింది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
