వీడినే రోయ్ కోటి రూపాయలకు పెళ్ళాం అమ్మేసింది!
on Apr 15, 2025

జగపతి బాబు అంటూ ఎవర్ గ్రీన్ హీరోగా అప్పటికీ ఇప్పటికీ ఎంతో పేరు ఉంది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ నటుడు..గృహిణులకు ఎంతో ఇష్టమైన నటుడు కూడా. లేడీ ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. శుభలగ్నం మూవీ జగపతిబాబు లైఫ్ లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక మైల్ స్టోన్. ఇక కొంత కాలంగా నెగటివ్ రోల్స్ లో కనిపిస్తూ మంచి మైలేజ్ ని సంపాదించుకున్నాడు జగపతి బాబు. అలాగే చాలా డౌన్ టు ఎర్త్ కూడా..అలాంటాయన ఒక షోకి కూడా వచ్చాడు. డ్రామా జూనియర్ సీజన్ 8 ఎపిసోడ్ కి వచ్చి కాసేపు అలరించారు. హోస్ట్ సుధీర్ ఆయన్ని చూసి మీరు రావడం చాలా చాలా చాలా హ్యాపీగా ఉంది అనేసరికి జగపతి బాబు చాలా సీరియస్ గా చూసాడు.
"సర్ ఏంటి చాల సీరియస్ గా ఉన్నారు. ఎవరొస్తే మీరు నవ్వుతారో వాళ్లనే రప్పిస్తాను" అంటూ రాజాని, ఆమనిని పిలిచాడు. ఇక అనిల్ రావిపూడి ఐతే "తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేని కంబినేషన్ జగపతి బాబు, ఆమని, రోజా" అంటూ కితాబిచ్చాడు. "ఐనా అలా ఎలా అమ్మేశారండి ఆమని గారు" అని అడిగారు అనిల్. "కోటి రూపాయలు వస్తుంటే మొగుడెందుకు వేస్ట్ కదా" అన్నాడు జగపతి బాబు. "ఒకసారి ఎన్నికల క్యాంపైన్ కి వెళ్లాను. అప్పుడే శుభలగ్నం రిలీజ్ అయ్యాక. అప్పుడు జనాలు కొంతమంది...ఒరేయ్ వీడినే రోయ్ పెళ్ళాం అమ్మేసింది...వీడినే కోటి రూపాయలకు అమ్మేసింది" అంటూ తన లైఫ్ లో జరిగిన విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి "మీ రియల్ లైఫ్ లో మీ ఆవిడ ఇంకొకళ్ళకు నిజంగా అమ్మేస్తే మీరెలా ఫీలవుతారు సర్" అని అడిగాడు. "అమ్ముడుపోతా" అని సింపుల్ గా చెప్పేసాడు. ఆ ఆన్సర్ కి అందరూ నవ్వేశారు. ఏ సినిమాలో లేనిది శుభలగ్నం మూవీలో కనిపిస్తుంది. అదే కట్టుకున్న భర్తను కోటి రూపాయలకు అమ్మేయడం అనే కాన్సెప్ట్ అప్పట్లో జనాల్లోకి బాగా వెళ్ళింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



