Brahmamudi : అమ్మ బర్త్ డే రోజున రాజ్ వస్తాడా.. అపర్ణకి మాటిచ్చిన కావ్య!
on Apr 16, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -696 లో..... రాజ్ ని కలవాలని కావ్య కావాలానే నేను కూరగాయలకి వెళ్తున్నానని హింట్ ఇస్తుంది. దాంతో రాజ్ కూడా నేను వస్తానని చెప్తాడు. మీరెందుకు అక్కడికి అని కావ్య అనగానే.. నేను కూరగాయలు తీసుకోవడానికి అని రాజ్ అంటాడు. ఆ తర్వాత కావ్య అడ్రెస్స్ చెప్పగానే రాజ్ బయలుదేర్తాడు. కావ్య రాజ్ కోసం వెయిట్ చేస్తుంది. అక్కడ కూరగాయలు అమ్మే వాళ్ళు ఎవరి గురించి వెయిట్ చేస్తున్నారని కావ్యని అడుగగా నా భర్త గురించి అని కావ్య అంటుంది.
అంటే నీ భర్త నీ దగ్గర ఉండడా అని వాళ్ళు అనగానే.. లేదు వేరేవాళ్ళ ఇంట్లో ఉంటున్నారని చెప్తుంది. వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే నువ్వు ఎలా ఉరుకుంటున్నావని వాళ్ళు అంటారు. అప్పుడే రాజ్ వస్తాడు. కూరగాయలు ఇప్పుడు ఎందుకు అని రాజ్ ని కావ్య అడుగుతుంది. పక్కన ఎవరో ఫోన్ మాట్లాడుతూ అన్నదానం అంటారు. దాంతో రాజ్ విని అన్నదానం కోసమని చెప్తాడు. అన్నదానం ఎందుకు.. రేపు ఏంటి స్పెషల్ అని కావ్య అడుగగా.. మా అమ్మ బర్త్ డే అని రాజ్ అనగానే ఈయనకి గతం గుర్తు ఉండి ఫ్రాంక్ చేస్తున్నారా అని కావ్య అనుకుటుంది. చిన్నప్పుడు మా వాళ్ళు చనిపోయారు. నాకు ఇలా ప్రతి సంవత్సరం చెయ్యడం అలవాటు అని రాజ్ ఏదో తోచింది చెప్తుంటాడు. అత్తయ్య బాగున్నారు ఇలా అంటున్నాడని కావ్య టాపిక్ డైవర్ట్ చేస్తుంది. అన్నదానం ఎక్కడ అని కావ్య అడుగుతుంది. రాజ్ ఏదో ఆలోచిస్తుంటే కావ్యనే చెప్పగా.. అవునని రాజ్ అంటాడు.
ఆ తర్వాత కావ్య, రాజ్ ఇద్దరు బయలుదేర్తారు. రాజ్ ఇంటికి రాగానే బావ కూరగాయలు తెచ్చావా అని యామిని అడుగుతుంది. నేను కూరగాయల షాప్ కి వెళ్లినట్లు నీకెలా తెలుసు అని రాజ్ కోప్పడతాడు. మొన్న అలాగే వచ్చావ్.. ఇప్పుడు ఇలా చేస్తున్నావ్.. నన్ను ఫాలో అవుతున్నావా అని రాజ్ అంటుంటే.. లేదు బావ అటుగా వెళ్తుంటే కన్పించావని యామిని అంటుంది. మరొకవైపు కావ్య బీరువా తీస్తుంటే రాజ్ షర్ట్ పై ఆర్ అనే లెటర్ ఉండే షర్ట్ కిందపడిపోతుంది. అది చూసి రాజ్, కావ్య మధ్య షర్ట్ గురించి జరిగిన సంఘటన గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
