
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'( Illu illalu pillalu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -400 లో.... ఇరవై లక్షలు ఎక్కడ సాగర్ అని నర్మద అడుగుతుంది. సాగర్ సంబంధం లేకుండా సమాధానం చెప్తుంటే నర్మద తన ఫ్రెండ్ కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. రమ్య నా భర్త బ్యాంకు నుండి ఇరవై లక్షలు డ్రా చేసాడు అంటున్నావ్ తనేమో చెయ్యలేదంటున్నాడని అడుగుతుంది. లేదే చేసాడు కావాలంటే ప్రొద్దున డీటెయిల్స్ పంపిస్తానని తన ఫ్రెండ్ చెప్తుంది. నా ఫ్రెండ్ బ్యాంకు లో జాబ్ చేస్తుంది. నువ్వు డబ్బు తీసుకోవడం తను చూసిందని సాగర్ తో నర్మద చెప్తుంది.
ఇప్పుడు చెప్పు సాగర్ లేదంటే నా మీద ఒట్టే అని నర్మద అంటుంది. నాకు ఎగ్జామ్ రాస్తే జాబ్ రాలేదు. మిల్ నుండి అయిదు లక్షలు వనజ గారు ఇచ్చిన ఇరవై లక్షలు లంచం ఇచ్చి జాబ్ కొన్నానని సాగర్ చెప్పగానే తన చెంపచెల్లుమనిపిస్తుంది నర్మద. ఇప్పటికే ఇంట్లో అంత నా వల్లే జాబ్ చేస్తున్నావని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇది కూడా నా వల్లే అంటారు. కనీసం మీ నాన్న గురించి ఆలోచించావా అని నర్మద కోప్పడుతుంది. ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండనని నర్మద బట్టలన్నీ సర్దుకుంటుంది. ప్లీజ్ నర్మద అని సాగర్ తన కాళ్ళు పట్టుకొని వద్దని రిక్వెస్ట్ చేస్తాడు. ఇప్పుడు నాకు నువ్వే సాయం చెయ్యాలి లేదంటే చావే అని సాగర్ అంటాడు. దాంతో నర్మద ఆగిపోతుంది. మరొకవైపు ధీరజ్ దగ్గర నుండి తన ఫ్రెండ్స్ హాస్పిటల్ కి అని కార్ అడిగి తీసుకొని వెళ్తారు కానీ వాళ్ళు ఎంజాయ్ చెయ్యడానికి తీసుకొని వెళ్తారు. ధీరజ్ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చెయ్యరు. అప్పుడే ధీరజ్ దగ్గరికి ప్రేమ వస్తుంది. అన్ని ప్రశ్న లు అడుగుతుంది. ప్రేమ చిరాకు తెప్పిస్తుంటే ప్రేమకి దగ్గరగా ధీరజ్ వెళ్తాడు. తన నడుం మీద చెయ్ వేసి ధీరజ్ మాట్లాడుతుంటే.. ప్రేమ వెనక్కి వెళ్తుంది. అక్కడే పడుకొని ఉన్న తిరుపతి కాలుపై అడుగువేస్తారు. దాంతో తిరుపతి గట్టిగా అరుస్తాడు.
ఇక్కడ తప్ప వేరే ప్లేస్ లేదా మీరు రొమాన్స్ చేసుకోవడానికి మీ రూమ్ లేదా అని తిరుపతి అంటాడు. దాంతో ధీరజ్, ప్రేమ ఏం మాట్లాడలేకపోతారు. మరుసటి రోజు అమూల్యకి రేవతి ముగ్గు వెయ్యడం నేర్పిస్తుంది. అప్పుడే శ్రీవల్లి వచ్చి నేను నేర్పిస్తాను. మీరు వెళ్ళండి అని రేవతిని లోపలికి పంపిస్తుంది. అసలు మీ పెళ్లి ఎలా జరిగింది.. నీ వెనకాల ఎవరున్నారని అమూల్యని శ్రీవల్లి అడుగుతుంది. అసలు నువ్వు వాడి దగ్గరికి ఎందుకు తీసుకొని వెళ్ళావని శ్రీవల్లిపై అమూల్య కోప్పడుతుంది ప్లీజ్ ఆ విషయం ఎవరితో అనకు అని శ్రీవల్లి అంటుంది. అప్పుడే ప్రేమ వస్తుంది. వల్లి అక్క ఏం చేస్తున్నావని కోప్పడి లోపలికి పంపిస్తుంది ప్రేమ. అమూల్య ఆ వల్లికి ఏం విషయం చెప్పకు.. ఏదైనా ఆ టైమ్ వచ్చినప్పుడు అందరికి తెలుస్తుందని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.








