
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -960 లో.. అప్పు, కళ్యాణ్ ని కిడ్నాప్ చేసింది కావ్య రాజ్ అనుకొని ధాన్యలక్ష్మి వాళ్ళని తిడుతుంది. కానీ వాళ్లే ప్రాణాలకి తెగించి కాపాడారని కళ్యాణ్ చెప్పగానే ధాన్యలక్ష్మి పశ్చాత్తాపపడుతుంది. కాసేపటికి రాజ్, కావ్యలకి ధాన్యలక్ష్మి సారీ చెప్తుంది. అప్పుకి ఆపరేషన్ చేస్తారు. తనకి పాప పుడుతుంది. అదే విషయం డాక్టర్ వచ్చి చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఆ తర్వాత అప్పు డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తుంది. అప్పు పాపని వాళ్ళ నానమ్మ ధాన్యలక్ష్మి చూసుకుంటుంది. కావ్య పాపని అపర్ణ చూసుకుంటుంది. ఇంట్లో అందరు సంతోషంగా ఉంటారు. హాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు. అప్పుడే మినిస్టర్ వస్తాడు. నా కూతురికి బారసాల ఫంక్షన్ చేస్తున్నాం.. మీరు తప్పకుండా రావాలని చెప్తాడు. మీరు నాకు ఆప్తులు.. ఖచ్చితంగా ఫ్యామిలీతో రావాలని మినిస్టర్ రిక్వెస్ట్ చేస్తాడు. రాజ్, కావ్య వస్తామని మాటిస్తారు. మినిస్టర్ వెళ్ళాక నేను రానని ఇందిరాదేవి అంటుంది. వాడు చేసింది నువ్వు మర్చిపోయావా అని అంటుంది. అవన్నీ మర్చిపోమని రాజ్ అంటాడు. మరొకవైపు రేఖ, రాహుల్ ఇద్దరు రుద్రాణి దగ్గరికి వెళ్లి మాట్లాడుతారు. అన్ని ప్లాన్ వేసారు.. అన్నీ ఫెయిల్ అయ్యాయని రుద్రాణి మీద రాహుల్, రేఖ కోప్పడతారు.
రేపు మినిస్టర్ ఇంట్లో బారసాల ఫంక్షన్ జరుగుతుంది. అక్కడికి రాజ్ ఫ్యామిలీతో వస్తాడు. నేను కూడా వస్తాను. అక్కడ అందరు నన్ను తిడతారు. మీరు కూడా నన్ను తిట్టండి. అప్పుడు సొంత పిల్లలే ఛీ కొడుతున్నారని సింపతీతో ఆ ఇంట్లోకి మళ్ళీ అడుగుపెడతానని రుద్రాణి చెప్తుంది. మరొకవైపు బారసాల ఫంక్షన్ కి వెళ్ళడానికి అందరు రెడీ అవుతారు. అప్పుకి ఇన్‌స్పెక్టర్ కాల్ చేసి రౌడీలని ఏం చెయ్యమంటారని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







