Home

»

Tv News

Karthika Deepam2 : దీప, శౌర్యలని చంపాలని చూసింది జ్యోత్స్న.. నిజం చెప్పేసిన దశరథ్!

Feb 21, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -599 లో..‌ కాశీ, పారిజాతం మాట్లాడుకుంటుంటే జ్యోత్స్న వస్తుంది. నువ్వు నాతో మాట్లాడకని జ్యోత్స్నపై కాశీ సీరియస్ అవుతాడు. నేను చెప్పింది పూర్తిగా విని ఉంటే బాగుపడేవాడివి అని జ్యోత్స్న అనగానే.. నువ్వు చెప్పింది పూర్తిగా విని ఉంటే జైల్లో ఉండేవాడిని అని కాశీ కోప్పడతాడు. నా భార్య నాకు దూరం అయిందని కాశీ అంటాడు. అయితే ఏంటి నువ్వు మరొకపెళ్లి చేసుకోమని జ్యోత్స్న అంటుంది. నీలాగా బంధాలని సులువుగా వదులుకోనని కాశీ అంటాడు. మరొకవైపు ఎందుకు నన్ను ఇంత మోసం చేశారు.. నా కూతురు జ్యోత్స్న కాదన్న విషయం ఎందుకు దాచారని కార్తీక్ పై దశరథ్ కోప్పడతాడు.

నా కూతురు ఎక్కడ ఉందని దశరత్ అడుగుతాడు. దీపాలు వెలిగిస్తున్న దీపని చూపించి తనే మీ కూతురు అని కార్తీక్ చూపిస్తాడు. దాంతో దశరథ్ షాక్ అవుతాడు.  దీప దగ్గరికి దశరథ్ వెళ్తాడు. ఏంటి చిన్నయ్య గారు ఇలా వచ్చారని దీప అడుగుతుంది. చిన్నయ్య గారు వస్తున్నట్లు చెప్పలేదు బావ అని దీప అంటుంది. చిన్నయ్య గారు కాదు నాన్న అని పిలవాలని దశరథ్ అనగానే మావయ్యకి నిజం తెలిసిందని కార్తీక్ చెప్పగానే దీప ఎమోషనల్ అవుతుంది.

దశరథ్ కాళ్ళపై పడి ఏడుస్తుంది. నాన్న అంటూ దశరథ్ ని హత్తుకొని ఏడుస్తుంది. నా కూతురు నా కళ్ల ముందే ఉంది అయినా చెప్పలేదని దశరథ్ అంటాడు. దీపని శౌర్యని చంపాలని చూసింది జ్యోత్స్ననే.. ఎందుకు జ్యోత్స్న అలా చేసిందో మీకు అర్ధం అయిందా.. ఎక్కడ తను అసలైన వారసురాలు కాదని తెలుస్తుందోనని భయంతో అంతా చేసింది.‌ దీప కడుపులో బిడ్డని కూడా చంపాలని ట్రై చేసింది. అత్త కాపాడిందని కార్తీక్ చెప్తాడు. దశరథ్ జరిగింది గుర్తుచేసుకుంటాడు. మావయ్య ఎప్పటికప్పుడు చెప్దామనుకున్న కానీ ఏదో ఒక అడ్డంకి అని కార్తీక్ చెప్తాడు. ఆ జ్యోత్స్నని వదలనని దశరథ్ కోపంగా బయల్దేరతాడు. మరొకవైపు బావని కలవడానికి దాస్ వెళ్ళాడని కాశీ చెప్తాడు. అసలు ఎందుకు వెళ్ళాడని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. అప్పుడే పారిజాతం వస్తుంది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావ్. అసలైన వారసురాలివి నువ్వే కదా అని పారిజాతం అంటుంటే జ్యోత్స్నకి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com