నీ మనసులో ఏం ఉందో చెప్పమని శైలేంద్రని నిలదీసిన ఫణీంద్ర!
on Jul 23, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -822 లో.. రిషిపై జరిగిన అటాక్ గురించి జగతికి మహేంద్ర చెప్పడంతో జగతి టెన్షన్ పడుతుంది. ఈ అటాక్ శైలేంద్ర చేయించి ఉంటాడని మహేంద్ర అనగానే.. బాబాయ్ అని శైలేంద్ర వస్తాడు. ఏంటి బాబాయ్ ఏదో మాట్లాడుకుంటున్నారు. నాకు తెలియకుండా ఎక్కడికో వెళ్లి వచ్చారు. పైగా నేను వస్తానంటే వద్దన్నారు. ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుందని శైలేంద్ర అంటాడు.
ఆ తర్వాత మహేంద్ర కోపంగా పదా నీకు కావలిసిన సమాధానం అంతా దొరుకుతుందని శైలేంద్రని హాల్లోకి లాక్కొని వెళ్తాడు. హాల్లోకి అందరు వస్తారు. అప్పుడు అక్కడే ఉన్న ఫణీంద్ర.. ఏంటి ఏమైంది మహేంద్ర అని అడుగుతాడు. ఈ మధ్య శైలేంద్ర హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడు. జగతి నేను బాల్కనీలో రిషి గురించి బాధపడుతుంటే వచ్చి ఏవేవో ఆరా తీస్తు మాట్లాడుతున్నాడని మహేంద్ర చెప్పగానే.. శైలేంద్రపై ఫణీంద్ర కోప్పడతాడు. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్..మొన్న రిషి గురించి తప్పుగా మాట్లాడావ్. ఈ రోజు భార్యభర్తలు మాట్లాడుకుంటుంటే మధ్యలో వెళ్ళావ్. అసలు నీ ప్రాబ్లమ్ ఏంటీ నీ మనసులో ఏం ఉంది చెప్పమని శైలేంద్రని ఫణీంద్ర నిలదీస్తాడు. బావగారు ఈ విషయాన్ని పెద్దది చెయ్యొద్దు వదిలేయండని జగతి అంటుంది. శైలేంద్ర మాత్రం పట్టరాని కోపంగా ఉంటాడు.
మరొకవైపు వసుధార అన్న మాటలు గుర్తు చేసుకుంటూ రిషి ఒక్కడే ఆలోచిస్తుంటాడు. "నిజంగా వాళ్ళు నా గురించి అబద్ధం ఆడారా? నాపై జరిగే ఎటాక్ కి వాళ్ళు చెప్పిన అబద్ధానికి కనెక్షన్ ఉందా? అయిన వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచిస్తున్నాను. నా పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల నా ఆశయాన్ని దూరం పెడుతున్ననా" అని రిషి అనుకుంటాడు.
మరొక వైపు ఏంటి మహేంద్ర తొందర పడ్డావని జగతి అడుగుతుంది. నా కొడుకు డాడ్ అని పిలిచేవాడు. సర్ అని పిలిచాడు. ఇంతకన్నా దురదృష్టం ఉంటుందా? తొందరలోనే నిజం బయటపెట్టి వాళ్ళ సంగతి చెప్తాను. రిషి మన దగ్గరికి తీసుకొస్తానని జగతికి చెప్తాడు మహేంద్ర. మరొక వైపు రిషి మాటలను వసుధార గుర్తుచేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఏంజిల్ భోజనానికి పిలుద్దామని వసుధార దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



