కావ్యని పుట్టింటికి తీసుకెళ్ళిన రాజ్.. ధాన్యలక్ష్మిని అవమానించిన స్వప్న!
on Jul 23, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -155 లో.. కావ్య చాటుగా కూర్చొని డిజైన్స్ వేస్తూ ఉంటుంది. రాజ్ వచ్చి కావ్య డిజైన్స్ వేస్తుందని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఎందుకు నాకు తెలియకుండా డిజైన్స్ వేస్తున్నావ్.. నాకు తెలియకూడదు అనుకున్నావా? తెలిసినా ఎంకరేజ్ చెయ్యడని చెప్పట్లేదా అని రాజ్ అడుగుతాడు. "అవును మీకు తెలియకూడదని ఇలా చేస్తున్నాను. మీరు డిజైన్స్ విషయంలో టెన్షన్ పడుతున్నారని నేను ఆఫీస్ కి వచ్చాను. నేను డిజైన్స్ వేసి తీసుకొని వస్తే మీరు చింపేసి డస్ట్ బిన్ లో పడేసారు. అవే డిజైన్స్ శృతి తీసుకొని వస్తే బాగున్నాయని మెచ్చుకున్నారు. అందుకే మీకు తెలియకూడదని శిరీష లాగా మారాను" అని కావ్య చెప్తుంది. సరే ఈ డబ్బు తీసుకో, నీ కష్టానికి ప్రతిఫలం అని రాజ్ డబ్బు ఇస్తాడు. కావ్య డబ్బు తీసుకుంటుంది. నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసుకోరా అని కావ్య అడుగగా.. అది నీ పర్సనల్. నాకు అవసరం లేదని రాజ్ అంటాడు.
ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం కావ్య, రాజ్ కి అన్ని పనులు చేసి పెడుతుంది. రాజ్ ఆఫీస్ కి బయల్దేరి వెళ్తుంటే.. కావ్య ఆగమని చెప్తుంది. అక్కడే అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. నేను మా అమ్మ వాళ్ళింటికి వెళ్లి వస్తానని కావ్య అడుగుతుంది. దానికి అపర్ణ ఒప్పుకోదు. ఆ తర్వాత ఇందిరాదేవి, రాజ్ వెళ్ళమని చెప్పాక అపర్ణ ఒప్పుకుంటుంది. వదిన వాళ్ళింటికి వెళ్తుంది. ఎలాగైనా వాళ్ళ ప్రాబ్లమ్ తెలుసుకుంటుందని కళ్యాణ్ అనుకుంటాడు. ఆ తర్వాత స్వప్న మోడల్ డ్రెస్స్ లో రెడీ అవుతుంది. అది చూసిన రాహుల్.. ఇంట్లో వాళ్ళు నిన్ను ఇలా చుస్తే గొడవ అవుతుందని అంటాడు. కానీ స్వప్న రాహుల్ మాటలు పట్టించుకోదు. ఆ తర్వాత రాజ్ కార్ లో బయల్దేరుతూ కావ్యని తీసుకొని వెళదామని అనుకుంటాడు. రాజ్ పిలిస్తే వెళదామని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత కావ్యని తీసుకొని రాజ్ కార్ లో బయలుదేరతాడు.
మరొక వైపు స్వప్న మోడల్ డ్రెస్ లో రెడీ అయి కిందకి వస్తుంది. అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి స్వప్నని చూస్తుంది. నీ అవతారం ఏంటి? నీకు పెళ్లి అయింది. ప్రెగ్నెంట్ వి. ఇలా రెడీ అయ్యావ్ ఏంటని అడుగుతుంది. మీలాగా ఒంటి నిండా నగలతో పాతకాలం మనిషిలాగా ఉండను నేను. మీలాగా మీ కొడుకుని తయారు చేశారని స్వప్న ధాన్యలక్ష్మితో గౌరవం లేకుండా మాట్లాడి వెళ్ళిపోతుంది. మరొక వైపు దారిలో వెళ్తుండగా కావ్యకి మల్లెపువ్వులు కొనిస్తాడు రాజ్. కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది.. ఆ తర్వాత మీ ఇల్లు వచ్చింది దిగమని కావ్యకి చెప్తాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



