కృష్ణ ఇచ్చిన టాస్క్ లో భవాని హిట్టు.. తన ముందు మార్కులు కొట్టేసిందా!
on Jul 23, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -216 లో.. రేవతికి ముకుంద వార్నింగ్ ఇస్తుంది. నేను నా ప్రేమ విషయం పెద్ద అత్తయ్యకి చెప్తాను, కృష్ణ మురారిలది అగ్రిమెంట్ మ్యారేజ్ అని కూడా చెప్తాను. అప్పుడు పెద్ద అత్తయ్య న్యాయం చెప్తుందని రేవతితో అంటుంది ముకుంద.
మరొక వైపు కృష్ణ, మురారిలు ఇద్దరు కలిసి కేఫ్ కి వెళ్తారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి ముకుంద వస్తుంది. ముకుందని చూసిన కృష్ణ షాక్ అవుతుంది. ఏంటి నువ్వు ఇక్కడ అని అడుగుతుంది. అమ్మకి మెడిసిన్ ఇవ్వడానికి వెళ్తుంటే మీ కార్ బయట కనిపించింది, పలకరించి వెళదామని వచ్చానని ముకుంద అంటుంది. సరే అని ముగ్గురు ఐస్ క్రీం తింటుండగా.. ముకుంద కావాలనే ఐస్ క్రీం కృష్ణపై పడేలా చేస్తుంది. దాంతో కృష్ణ వాష్ చేసుకొని వస్తానని వెళ్తుంది. అప్పుడు మురారితో మాట్లాడుతుంది ముకుంద. రేపో ఎల్లుండో వెళ్లే దానికోసం ఎందుకు అంత బాధపడుతున్నావని మురారితో ముకుంద అనగానే.. కృష్ణ నా భార్య ఎక్కడికి వెళ్ళదు వెళ్ళనివ్వనని మురారి అంటాడు. కృష్ణకి రేపు సన్మానం జరిగేటప్పుడు నువ్వు ఉండకూడదు. ఉన్నా స్టేజ్ పైకి వెళ్ళకూడదు అలా వెళ్తే పెద్ద అత్తయ్యకి మీది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్తానని ముకుంద చెప్పి వెళ్ళిపోతుంది. ముకుంద వెళ్ళిపోయాక కృష్ణ వస్తుంది. ముకుంద ఎక్కడ అని కృష్ణ అడుగుతుంది. వాళ్ళ అమ్మకి టాబ్లెట్స్ ఇవ్వాలని ఫోన్ వస్తే వెళ్లిందని మురారి చెప్తాడు. ఆ తర్వాత కృష్ణ, మురారి ఇంటికి వస్తారు. అందరి కోసం షాపింగ్ చేశారా అని భవాని అడుగుతుంది. అవును అత్తయ్య మీకు ఒక టాస్క్.. ఎవరికి ఏ చీర ఎందుకు తీసుకున్నానో చెప్పాలని భవానికి టాస్క్ ఇస్తుంది కృష్ణ.
ఆ తర్వాత కృష్ణ ఇంట్లో అందరిని పిలుస్తుంది. ఎవరికి ఏ చీర ఎందుకు తీసుకుందో భవాని కరెక్ట్ గా గెస్ చేస్తుంది. ఆ తర్వాత ఈ చీర నువ్వు నాకు ఎందుకు తీసుకున్నావని కృష్ణని అడుగుతుంది భవాని. మీరు హుందాగా కన్పించాలని తీసుకున్నా అని కృష్ణ అనగానే.. నన్ను కూడా చదివేసావా తింగరి పిల్ల అని భవాని అంటుంది. అలా భవాని అనేసరికి కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కృష్ణ తో భవాని సరదాగా మాట్లాడుతుంటే.. ముకుంద చూసి ఓర్వలేకపోతుంది. ఆ తర్వాత కృష్ణ మురారి ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత గదిలోకి ముకుంద వెళ్లి.. నీతో మాట్లాడాలి మురారి అని అంటుంది. వెళ్ళండి ఏసీపీ సర్ అని కృష్ణ అనగానే.. ముకుంద మురారి చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



