మోనాల్ గజ్జర్ అజ్ఞాతవాసి ప్రేమికుడు అతడేనా!
on Jul 25, 2023

మోనాల్ గజ్జర్.. ఈ పేరు అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ 4 దత్తపుత్రిక మోనాల్ అంటూ అప్పట్లో న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే.
మోనాల్ ఆమె తన కెరీర్ ని మొదటగా మోడల్ గా మొదలుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళ బాషల్లో పలు సినిమాల్లో నటించింది. తెలుగులో సుడిగాలి, వెన్నెల 1/2, బ్రదర్ అఫ్ బొమ్మాలి సినిమాలలో నటించింది. కానీ మోనాల్ కి మంచి హిట్ గా తన కెరీర్ లో లేదని చెప్పాలి. ఆ తర్వాత మోనాల్ బిగ్ బాస్-4 లో ఛాన్స్ కొట్టేసి ఒక్కసారిగా మళ్ళీ క్రేజ్ లోకి వచ్చింది. మోనాల్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో ఆశ్చర్యం లేదు. మోనాల్ బిగ్ బాస్ లో ఎక్కువ రోజులు ఉంది. హౌస్ లో తన మిస్టేక్ చేసిన బిగ్ బాస్ చుసి చూడనట్టు ఉండడంతో బిగ్ బాస్ అప్పట్లో ఫేవరేటిజం చూపిస్తున్నారనే నెగెటివ్ టాక్ మోనాల్ వల్ల బిగ్ బాస్ కి వచ్చింది. కారణం అప్పుడు మోనాల్ ఏ తప్పు చేసినా ఏం అనలేదు. దాంతో బిగ్ బాస్ దత్తపుత్రిక మోనాల్ అని అప్పట్లో ట్రోల్స్ కూడా వచ్చాయి.
హౌస్ లో మోనాల్ ట్రయంగిల్ లవ్ స్టోరీ నడిపించి, బిగ్ బాస్ లో ఎక్కువ రోజులు ఉందన్న టాక్ కూడా వచ్చింది. అయితే మోనాల్ బిగ్ బాస్ లో మొదటగా అభిజిత్, ఆ తర్వాత అఖిల్ సార్థక్ తో సన్నిహితంగా ఉంది. ఒకానొక సిచువేషన్ లో అఖిల్, మోనాల్ లవర్స్ అన్న అనుమానం రాకపోలేదు. బిగ్ బాస్ తర్వాత కూడా కొన్ని సందర్భాలలో అఖిల్, మోనాల్ ల గురించిన న్యూస్ తెగ వైరల్ అయింది. ఈ మధ్య జరిగిన బిబి జోడిలో తేజస్వినితో అఖిల్ జోడీ కట్టాడు. ఫ్యాన్స్ మాత్రం మోనాల్ తో అఖిల్ జోడి కడుతాడని ఊహించగా అది జరుగలేదు.
తాజాగా మోనాల్ తన ఇన్ స్టాగ్రామ్ లో తనకి ఎవరో ఒన అజ్ఞాత వ్యక్తి లెటర్, ఒక ఫ్లవర్స్ బొకే, చాక్లెట్ ప్యాక్ ని మోనాల్ కి పంపించడట.. " స్టే హ్యాపీ సి యూ సూన్ " అని ఒక మెసేజ్ గల లెటర్ ని పంపించడంట. అయితే ఆ లెటర్ తో కూడిన బొకేని పంపిందెవరని మోనాల్ కూడా తెలియదట. అందుకే " ఎవరు నువ్వు " అని మోనాల్ షేర్ చేసింది. దాంతో నెటిజన్లు మాత్రం.. అఖిల్ సార్థక్ అని ఇతని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



