రేవంత్ అమాయకుడని చెప్పిన ఆదిరెడ్డి!
on Jul 25, 2023
బిగ్ బాస్ సీజన్-6 లో సింగర్ కేటగిరీలో వచ్చిన రేవంత్ తన సత్తా చాటాడు. హౌస్ లోకి వెళ్ళిన మొదటి రోజు నుండి తనకున్న ట్యాలెంట్ తో , తను బయట ఎలా ఉన్నాడో లోపల కూడా అదే విధంగా ఉన్నాడు. దాంతో బిగ్ బాస్ చూసే ప్రేక్షకులలో కంటెస్టెంట్స్ కి ఉండే ఫ్యాన్ బేస్ లో రేవంత్ కే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది.
ఎల్.వి. రేవంత్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేపథ్య గాయకుడు. పలు సినిమాల్లో 200 కి పైగా పాటలు పాడాడు. ఎం. ఎం. కీరవాణి , కోటి, మణిశర్మ, చక్రి, థమన్ లాంటి సంగీత దర్శకుల దగ్గర పాటలు పాడాడు. 2017లో సోనీ మ్యూజిక్ చానల్ నిర్వహించిన ప్రముఖ పోటీ.. ఇండియన్ ఐడల్-9 లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-6 లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్-6 లో టాప్ 5 కంటెస్టెంట్లుగా రేవంత్, శ్రీహన్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ నిలవగా.. నాగార్జున ఆఫర్ చేసిన 40 లక్షల ప్రైజ్ మనీ తీసుకుని టాప్ 2 నుంచి శ్రీహన్ క్విట్ కావడంతో రేవంత్ విజేతగా నిలిచాడు.
తాజాగా బ్రో సినిమాలోని 'మై డియర్ మార్కండేయ' పాట పాడిన రేవంత్.. ఈ సాంగ్ హిట్ కావడంతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. అయితే ఆదిరెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ లో ' ఆస్క్ మి క్వశ్చన్ ఎబోట్ బిగ్ బాస్ సీజన్-6' అని పెట్టాడు. దాంతో ఒకరు రేవంత్ గురించి అడిగారు. " బిగ్ బాస్ తర్వాత రేవంత్ తో మీ రిలేషన్ ఎలా ఉందని " ఒకరు ఆదిరెడ్డిని అడుగగా.. " రేవంత్ మామతో నాకు మంచి బాండింగ్ ఉంది. మామ వెరీ డౌన్ టూ ఎర్త్ బిహేవియర్. కొన్నిసార్లు అమాయకుడిగా ఉంటాడు. మొత్తంగా తనొక మంచి స్నేహితుడు " అని ఆదిరెడ్డి చెప్పాడు. అయితే ఆదిరెడ్డి ఇలా రేవంత్ గురించి చెప్పడంతో దానిని స్క్రీన్ షాట్ తీసి తన ఇన్ స్టాగ్రామ్ స్టాటస్ లో షేర్ చేసాడు రేవంత్. కాగా ఈ పోస్ట్ చూసిన బిగ్ బాస్ సీజన్-6 అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
