స్వప్నని బోల్డ్ గా చూపించాలని చెప్పిన రాహుల్!
on Jul 25, 2023
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -156 లో... కావ్యని రాజ్ వాళ్ళ పుట్టింట్లో దింపి వెళతాడు. హాస్పిటల్ ఖర్చుల కోసం చెవి కమ్మలు అమ్మి డబ్బులు తీసుకొని రా అని కనకం తన చెవి కమ్మలు కృష్ణమూర్తికి ఇస్తుంది. కృష్ణమూర్తి వెళ్తుండగా అప్పుడే కావ్య వస్తుంది.
ఆ తర్వాత కావ్య కనకం దగ్గరికి వెళ్లి హగ్ చేసుకుని.. ప్రేమగా మాట్లాడుతుంది. ఎలా ఉన్నావ్ అమ్మ అని కావ్యని కృష్ణమూర్తి అడుగుతాడు. సంతోషంగా ఉన్నానని కావ్య చెప్పగానే.. అత్తింటి కష్టాలు ఆ గడపలోనే ఉంచి వచ్చావా అని కృష్ణమూర్తి అంటాడు. లేదు నాన్న నా సంతోషాన్ని పుట్టింటి వాళ్ళతో పంచుకోవడానికి వచ్చానని కావ్య అంటుంది. కావ్య తను డిజైన్స్ వేసి సంపాదించన డబ్బులు కృష్ణమూర్తికి ఇస్తుండగా.. వద్దని అంటాడు. ఆ తర్వాత కావ్య బలవంత పెట్టడంతో డబ్బులు తీసుకుంటారు. ఆ తర్వాత అన్నపూర్ణ గురించి కావ్య తెలుసుకొని.. నీ హాస్పిటల్ ఖర్చు మొత్తం నేనే బరిస్తానని కావ్య చెప్పగానే అన్నపూర్ణ ఎమోషనల్ అవుతుంది.
మరొక వైపు స్వప్న అన్న మాటలకు ధాన్యలక్ష్మి బాధపడుతు కూర్చొని ఉంటుంది అప్పుడే రుద్రాణి వస్తుంది. నా కోడలిని ఇంట్లో నుండి పంపించడానికి నిన్ను వాడుకుంటన్నా ధాన్యలక్ష్మి అని రుద్రాణి తన మనసులో అనుకుంటుంది. ఏమైంది ధాన్యలక్ష్మి అని రుద్రాణి అడుగుతుంది. స్వప్న అన్న మాటలు రుద్రాణికి చెప్పగానే.. ఇంట్లో అందరిని పిలుస్తుంది. నిన్ను అన్ని మాటలు అందా.. అసలు దాన్ని ఈ రోజు వదిలిపెట్టొద్దని రుద్రాణి కావాలనే ఓవర్ చేస్తుంటుంది. అక్కడికి ఇంట్లో అందరూ వస్తారు. అసలు ఏమైందని రుద్రాణిని అపర్ణ అడుగుతుంది. ధాన్యలక్ష్మిని స్వప్న అవమానించిందని రుద్రాణి చెప్పగానే.. అసలు ఏమైంది నువ్వు చెప్పు ధాన్యలక్ష్మి అని ఇందిరాదేవి అడుగుతుంది. దాంతో స్వప్న అన్న మాటలు ధాన్యలక్ష్మి ఇంట్లో వాళ్లకి చెప్తుంది.
మరొక వైపు స్వప్న మోడల్ షూట్ కి వెళ్తుంది. అక్కడ మేనేజర్ స్వప్నకి అందరిని పరిచయం చేస్తాడు. ఒక్కప్పుడు ఈ స్టూడియో లోకి రానిచ్చే వారు కాదు. ఇప్పుడు ఇంత మంచి అవకాశం దుగ్గిరాల ఇంటికి కోడలు అంటే ఇలాగే ఉంటుందని స్వప్న అనుకుంటుంది. అప్పుడే మోడల్ షూట్ డైరెక్టర్ స్వప్న దగ్గరికి వస్తాడు. ఈ షూట్ చాల స్పైసి గా చేద్దామని అనుకుంటున్నట్టుగా డైరెక్టర్ అనగానే.. మీ ఇష్టం సర్ మీరు ఎలాగంటే అలాగే అని స్వప్న అంటుంది. ఆ తర్వాత డైరెక్టర్ కి రాహుల్ కాల్ చేసి చాలా బోల్డ్ గా షూట్ జరగాలి. ఆ ఫొటోస్ ని చూసిన వాళ్ళంతా ఇబ్బంది పడేలా చెయ్యాలని రాహుల్ అనగానే.. సరే అని డైరెక్టర్ అంటాడు. మరొకవైపు కావ్య తన పుట్టింటి వాళ్ళతో కలిసి సరదాగా భోజనం చేస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



