Home

»

Tv News

Karthika Deepam2: దీప వంటకి కస్టమర్ పాజిటివ్ రివ్యూ.. షాక్ లో మాలిని!

Nov 4, 2026 9:54AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -820 లో.....దీపకు క్యాటరింగ్ లో సమస్య రావడంతో తనే స్వయంగా వెయ్యి మందికి వంట చేస్తానని రెడీ అవుతుంది.నాణ్యమైన వంటకు సాయంగా ఎవరు ఉంటారని అడిగితే కార్తీక్, జ్యోత్స్న ముందుకు వస్తారు. పనివాళ్లు కూడా అండగా ఉంటామని అంటారు. సూరజ్ షాక్ అవుతాడు. మరోవైపు సుమిత్ర పని చేస్తున్న ఇంట్లోనే దశరథ్ కి ఎదురుపడుతుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసి షాక్ అవుతారు. ఆ రోజు విన్న గొంతు సుమిత్రదేనని దశరథ్ మనసులో బాధపడతాడు.

రంగంలోకి దిగిన దీప అందరితో కలిసి వంటలు ప్రారంభిస్తుంది. మినిస్టర్ కాల్ చేస్తే కార్తీక్ మాట్లాడి మటన్ బిర్యానీ తప్ప అన్నీ టైంకి వస్తాయని ఒప్పిస్తాడు. జ్యోత్స్న టమాటాలు కట్ చేస్తుండగా, సూరజ్ కూడా ఏప్రాన్ వేసుకొని వంట చేస్తాడు. దాన్ని చూసి మాలిని షాక్ అయిపోతుంది. అందరూ కలిసి వంట పూర్తి చేస్తారు.

వంట పూర్తయ్యాక మాలిని ఆఫీస్ లో హడావుడి చేస్తుంది. దీప మేనేజ్మెంట్ బాలేదంటూ గోల చేసి, నష్టం వచ్చిందని సీఈఓ పోస్ట్ కి రాజీనామా చేయమని అంటుంది. సూరజ్ కూడా మా అమ్మ మాటే నా మాట అని దీప మీద అరుస్తాడు. దీపకు జ్యోత్స్న అండగా మాట్లాడితే పీఏలా ఉండమని సూరజ్ అంటాడు. అప్పుడే ఫోన్ వస్తుంది.

కస్టమర్ కాల్ లో వంటలను అమృతం అంటూ ప్రశంసిస్తాడు. స్పెషల్ బిర్యానీ అదుర్స్ అంటూ కార్తీక్, దీప, జ్యోత్స్నలను మెచ్చుకుంటాడు. దీంతో మాలిని, సూరజ్ ముఖాలు మాడ్చుకుంటారు. తర్వాత కార్తీక్ గుంపులో గొర్రె దూరిందని ఫైర్ అవుతూ లిస్ట్ ఇచ్చింది, బిల్ పాస్ చేసింది ఎవరని మేనేజర్ ను అడుగుతాడు. మేనేజర్ దీప పేరు చెప్పి, నాసిరకం సరుకులు కొన్నది తనేనని భయపడతాడు. మాలిని పేరు చెప్పేలోపే మాలిని కంగారుగా అతన్ని కొట్టి గెంటించేస్తుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com