Home

»

Tv News

Illu Illalu Pillalu: విడాకులు పంపింది నేనే ఒప్పుకున్న చందు.. షాక్ లో కుటుంబం!

Nov 4, 2026 9:45AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-621 లో.....వల్లిని క్షమించేదే లేదని చందు తెగేసి చెప్తాడు. బతుకమ్మ ఆడుతుండగా వల్లి కాలు జారి చందు మీద పడితే చందు కిందకు తోసేస్తాడు. నా తప్పు తెలుసుకున్నా, క్షమించమని వల్లి రిక్వెస్ట్ చేసినా నువ్వు చేసింది తప్పులు కాదు మోసాలు అని వేదవతి ఫైర్ అవుతుంది. పగ తీర్చుకునే అవకాశం ఇవ్వమని బతుకమ్మను కోరావా అంటూ వల్లిపై మండిపడుతుంది. నీకు మా ఇంటి గడప తొక్కే అర్హత లేదని చెప్పేసరికి వల్లి పక్కకు వెళ్తుంది.

బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి వెళ్లినప్పుడు చందును చూసి అంజలి షాక్ అవుతుంది. మన పెళ్లి గురించి చెప్పేద్దామని చందును అడిగిన పాత రోజులు, వేరే వాళ్లను పెళ్లి చేసుకొని ఏడుస్తూ వెళ్లిన చేదు జ్ఞాపకాలు గుర్తుచేసుకొని అంజలి ఫీల్ అయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు భద్రావతి ఉసిగొల్పడంతో రెచ్చిపోయిన భాగ్యం ఊరందరి ముందు పరువు తీస్తానంటూ గుడికి పరుగులు పెడుతుంది.

రామరాజు ఫ్యామిలీ ఇంటికి వెళ్తుండగా వల్లి వెళ్లి రామరాజు కాళ్లపై పడి ఏడుస్తుంది. నన్ను ఎక్కువగా నమ్మింది మీరే మామయ్య, కోడలిగా కాకుండా కడుపులో పెట్టుకొని చూసుకున్నారు.. మిమ్మల్ని మోసం చేశానని క్షమాపణ కోరుతుంది. అప్పుడే వచ్చిన భాగ్యం వల్లిని పైకి లేపి.. కాళ్లు పట్టుకోవడానికి రామరాజు దేవుడా, దుర్మార్గుడు అంటూ రచ్చ మొదలుపెడుతుంది.

 

నా కూతురు జీవితం నాశనం చేసి కొడుక్కి ఇంకో పెళ్లి చేద్దామనుకుంటావా అంటూ భాగ్యం రామరాజు కాలర్ పట్టుకుంటుంది. వేదవతి వెంటనే భాగ్యం చేయి తీసేసి ఎడాపెడా చెంపలు వాయిస్తుంది. నా మొగుడి కాలర్ పట్టుకుంటావా అంటూ కొడుతుంది. చివరికి భాగ్యం విడాకుల నోటీసులు పంపారని చెప్పడంతో అందరి మైండ్ బ్లాక్ అవుతుంది. నోటీసులు తనే పంపించానని, వల్లితో కలిసి ఉండటం ఇష్టం లేదని చందు చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com