.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1179 లో.....ఇందు, రాజు కలిసి ఒకే కారులో వెళ్లాలని ప్రశాంత్ ప్లాన్ వేస్తాడు. రాజు బైక్ సైలెన్సర్ లో కర్చీఫ్ పెట్టడంతో బైక్ స్టార్ట్ అవ్వదు. తర్వాత రాజును కన్విన్స్ చేసి ఇందుతో కలిసి కారులో వెళ్లేలా చేస్తాడు. ఇల్లు రాగానే రాజు దిగి వెళ్తుంటే ఇందు ఆపి జరుగుతున్న పరిణామాలు చెప్తుంది. చివరిగా ఏదైనా చెప్పాలా అని ఇందు అడిగితే "హ్యాపీ మ్యారీడ్ లైఫ్" అంటూ రాజు వెళ్లిపోతాడు.
మరోవైపు రేపు పెళ్లి ఉందని బట్టలు సెలెక్ట్ చేసుకుంటున్న లక్కీని చూసి ఇది ఇల్లా పెంటా అంటూ తిడుతుంది. నువ్వు పెళ్లి కొడుకువి కాదు, జరిగేది నీ పెళ్లి కాదు అంటూ హీనంగా మాట్లాడుతుంది. లక్కీ మాత్రం బాధపడుతూనే "అలాగే ఐషు" అంటాడు.
హాస్పిటల్ లో మీకు ఇచ్చిన మాట కోసమే మౌనంగా ఉన్నానని ఇందు చెప్తుంది. కానీ మీరు బావను నాకు దూరం చేయడం కరెక్ట్ కాదని నిలదీస్తుంది. దానికి చలపతి, ఎవరు ఒప్పుకున్నా లేకున్నా రాజు నా బిడ్డ, 25 ఏళ్లు ప్రాణం పెట్టి పెంచాను అంటాడు. రాజు వల్లే తన జీవితం మారిందని, తెలియకుండానే రాజును ప్రేమించానని ఇందు ఏడుస్తూ చెప్తుంది.
ఇంట్లో పెళ్లి పనులు జోరుగా సాగుతుండగా పంతులు దీపపు వత్తులు అడిగితే తను కంపెనీ సీఈవోనని ఐశ్వర్య రుబాబు చేస్తుంది. మరోవైపు అపర్ణ పెళ్లి ఆపేందుకు రాజుకు ఫోన్ చేస్తుంది, కానీ రాజు లిఫ్ట్ చేయడు. పైన రూంలో పెళ్లికూతురుగా రెడీ అవుతున్న ఇందును చూసి భ్రమరాంబ షాక్ అవుతుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
