Home

»

Tv News

Jayam Serial: బాలకృష్ణని చూసి షాక్ అయిన రుద్ర, గంగ.. శకుంతల టెన్షన్!

Nov 11, 2026 9:12AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -423 లో.. గంగ, రుద్ర ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారని పెద్దసారు ఎమోషనల్ అవుతాడు. ఏంటి ఏదో ఆడపిల్ల అత్తారింటికి వెళ్తున్నట్లు ఎందుకు ఇలా చేస్తున్నారని ఇషిక అనగానే నీకేం తెలుసు బంధాల గురించి అని రుద్ర అంటాడు.వాళ్ల చిన్నప్పటి జ్ఞాపకం గుర్తు చేస్తూ మా పెద్దమ్మ ఎప్పుడు మమ్మల్ని చూడకుండా ఉండలేదని చెప్తాడు. మీరు బయట ఉంటున్నారు అంతే ఫుడ్ అంతా ఇక్కడ నుంచే తీసుకొని వస్తానని ప్రమీల అంటుంది. ఎందుకు బాబుని రుద్ర చూడొద్దన్నారు కానీ గంగ కాదుగా, గంగ వచ్చి తన పనులు చేసుకుని మళ్లీ వెళ్తుందని శకుంతల అంటుంది.

ఆ తర్వాత గంగ వాళ్లని వాళ్ల ఇంటికి తీసుకెళ్లడానికి విశ్వ, సుధా వస్తారు. ఏంటి చెప్పకుండా వచ్చారని ఇంట్లో వాళ్లు అడుగుతారు. నా పుట్టింటికి నేను ఎప్పుడైనా వెళ్తానని సుధా అందని విశ్వ అంటాడు. ఆ తర్వాత అందరం రుద్ర అన్నయ్యకి దూరంగా ఉండాలని సూర్య అంటాడు. ఆ మాటకి విశ్వ తనపై సీరియస్ అవుతాడు. గంగ వెళ్లిపోవడం వల్ల ఇంట్లో అందరు ఎమోషనల్‌గా ఉంటారు. రుద్ర మాత్రం పెద్దమ్మను వదిలి ఉండలేక మదనపడుతూ ఉంటాడు.

ఇంతలో అక్కడికి బాలకృష్ణ వస్తాడు. తను రావడంతో అందరు షాక్ అవుతారు. నువ్వు స్కెచ్ ఆర్టిస్ట్ రామణాతం అసిస్టెంట్ కదా అని విశ్వ అడుగుతాడు. ఇంతకీ నా స్కెచ్ ఎందుకు వేశారని గంగ అడుగుతుంది. గంగ స్కెచ్ వెనుక అసలు కారణం ఏంటి, ఎవరు వేయించారనేది ఉత్కంఠ రేపుతోంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com