Home

»

Tv News

Ye Devi Varamo Neevu Serial: క్లాసికల్ డ్యాన్స్‌ తో అదరగొట్టిన అంజలి, గీత!

Nov 11, 2026 9:10AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు' (Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -112 లో.. కృష్ణజకి అంజలి క్లాసికల్ డాన్స్ నేర్పిస్తుంది. చాలా బాగా చేశావని ఇంట్లో అందరు మెచ్చుకుంటారు. అంతకన్నా బాగా గీత చేస్తుందని భాను అంటాడు. ఇప్పుడు నా కోసం అంజలితో డ్యాన్స్ చేయమని భాను అంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకని గీత అన్నా వినకుండా ఇంట్లో అందరు బలవంతం చేయడంతో అంజలితో కలిసి గీత క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంది. ఇద్దరూ ఒకరిని మించి ఒకరు బాగా పర్ఫామెన్స్ చేస్తారు.

అందరు గీత బాగా చేసిందంటారు.. దానికి అంజలి మురిసిపోతుంది. ఒక మనిష్ మాత్రం అంజలి బాగా చేసిందంటాడు. అవును కొన్ని కొన్ని అంజలి బాగా చేసింది కంగ్రాట్స్ అంజలి అని గీత అనగానే అంజలి సంతోషానికి అవధులు లేకుండాపోతాయి. మరోవైపు అంజలిని చూసి భవిత కుళ్లుకుంటుంది. భవిత దగ్గరికి రోహిత్ వచ్చి.. బావ ఏంటి అంజలి మమ్మీ కంటే బాగా చేసిందంటున్నాడు..నాకు అయితే నచ్చలేదని రోహిత్ అనగానే నాక్కూడా నచ్చలేదని భవిత అంటుంది.

అసలు మనీష్ బావ ఏంటి ఈ మధ్య తనతో క్లోజ్‌గా ఉంటున్నాడు.. ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించాలి.. నువ్వు హెల్ప్ చేస్తావా అని రోహిత్‌ని భవిత అడుగుతుంది. అమ్మో నేను చేయనని రోహిత్ భయపడతాడు. మరోవైపు మనీష్‌ని అంజలి ఆటపట్టిస్తుంది. వాళ్లిద్దరూ సరదాగా ఉండడం చూసి రత్నం హ్యాపీగా ఫీల్ అవుతుంది.భవిత మాత్రం కుళ్లుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com