.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి' (Godavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ - 160 లో.. జాను సంజయ్‌తో గొడవపడి బ్యాగ్ సర్దేసి వెళ్లిపోతుంటే బామ్మ ఆపుతుంది. సంజయ్ వాళ్ల అమ్మానాన్నల దగ్గర పెరగలేదు, అమ్మ ప్రేమలో, అమ్మాయి ప్రేమలో మోసపోయాడు, మోసపోవడం వాడికి అలవాటు అయిపోయిందని చెప్తుంది. వాడు ఇలా ప్రేమలు బంధాలు తెలీకుండా పెరగడానికి వాడి కన్న తల్లే కారణమని ఫ్లాష్‌బ్యాక్ చెప్తుంది. జయంతి అనే హైక్లాస్ అమ్మాయి శేఖర్ అనే మిడిల్ క్లాస్ వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుందని.. ఆ తర్వాత తన డ్రీమ్స్ పెద్దవి అని కొడుకు సంజయ్‌ని వదిలేసి జగదీష్‌తో కలిసి అమెరికా వెళ్లిపోయిందని చెప్తుంది. సంజయ్‌ని పట్టుకుని శేఖర్ ఏడ్చిన సీన్ గుర్తుచేస్తుంది.
జానుకి పార్వతీ మొత్తం స్టోరీ చెప్పి సంజుకి తనే అమ్మనయ్యానని, తాతయ్యే నాన్న అయ్యారని అంటుంది. తర్వాత సంజయ్ జీవితంలోకి ప్రేమ పేరుతో ఒక అమ్మాయి వచ్చి నవ్వడం మొదలుపెట్టాడని, ఆమె కూడా మోసం చేసి వదిలేసిందని చెప్తుంది. ఇప్పుడు నువ్వు కూడా వెళ్లిపోతే సంజుని ముచ్చటగా మూడోసారి మోసం చేసిన దానివి అవుతావని, మీ తాతయ్య సున్నిత మనస్తత్వం కలవారు తట్టుకోలేరని, మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్తే ఆ ఇంటిని చూస్తూ సంజయ్ బాధపడతాడని బామ్మ జానుని ఏడిపిస్తుంది. బంధం అంటే భరించాలని, ఓపికగా ఉండాలని చెప్పడంతో జాను మనసు మార్చుకుని లోపలికి వెళ్తుంది.
మరోవైపు జాను గురించి సంజయ్ టెన్షన్ పడుతుంటాడు. అగ్రిమెంట్ మీద సైన్ చేసింది, డబ్బులు తీసుకుంది, అమ్మమ్మ తాతయ్యలకి నచ్చేలా మసిలింది, ఇప్పుడు ఇల్లు వదిలేసి వెళ్లిపోయిందని, ఒకవేళ నిజం చెప్తే అమ్మమ్మ తాతయ్యల గుండె ఆగిపోతుందని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో జాను గదిలోకి వస్తుంది. తిట్టి వెళ్లావ్ కదా అని సంజయ్ అంటే తిట్టి వెళ్లలేదు తిడితే వెళ్లా అని జాను అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
