
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి (Godavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-164 లో.. ఇంట్లో లక్ష్మీ పూజకి శారద ఏర్పాట్లు చేస్తుంది. నందు కూడా ఉంటే బాగుండు అని బామ్మ అంటే నా ఇద్దరు కూతుళ్లు పూజకి లేరని శారద బాధపడుతుంది. నందు లేకుండానే పూజ చేసేస్తారు. మరోవైపు సంజయ్ టిఫెన్ చేయడానికి వచ్చి జాహ్నవి గారు ఆకలేస్తుందని అంటాడు. జాను పలకకపోవడంతో జాను గారు, బీఏ పాస్ గారు, నటకుమారి గారు అలక తీసి గట్టు మీద పెట్టి టిఫెన్ పెట్టు అంటాడు. జాను కోపంగా టిఫిన్ టేబుల్ మీద పెట్టేస్తుంది.. సంజయ్ తో డైరెక్ట్ గా మాట్లాడకుండా ప్లేట్, మూత, గ్లాస్ మీద పెట్టి మాట్లాడుతుంది.
సంజయ్ చట్నీ తిని కారానికి మంట మంట అని అరుస్తాడు. బాగా అయిందని జాను అనుకుంటుంది. నా వంటలు ఇలాగే ఉంటాయి నచ్చితే తినొచ్చు లేదంటే వండుకోవచ్చు అని జాను అంటే, ఇలాంటివి తినే కంటే నేను వండుకోవడం బెటర్ అని సంజయ్ వంట చేసుకోవడానికి వెళ్తాడు. కిచెన్ లో సంజయ్ చెఫ్ గా మారి వంట చేస్తుంటే జాను ఓ టెడ్డీ బియర్ తీసుకొచ్చి పండు పండు అంటూ ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుతుంది. ఇద్దరూ పొట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు పడిపోతూ కళ్లలోకి చూసుకుంటారు.
ఆఫీస్ లో నందు, బాస్ ఆకర్ష్ స్టాఫ్ మొత్తం లక్ష్మీ పూజ చేస్తారు. నందుని రమ్మని మురళి చాలా సార్లు ఫోన్ చేసినా నందు లిఫ్ట్ చేయదు. ఆఫీస్ లో ఆకర్ష్ నందుకి దీపం వెలిగించమని అంటాడు. నందు దీపం వెలిగిస్తుంది. నందు చీరకి దీపం తగిలి చీర కొంగు కాలిపోతూ ఉంటే ఆకర్ష్ చూసి నందుని లాగుతాడు. నందు తప్పుగా అనుకుని ఆకర్ష్ ని లాగిపెట్టి అందరి ముందు కొడుతుంది. ఆకర్ష్ హర్ట్ అయి వెళ్లిపోతాడు. నందు ఆ తర్వాత ఏడుస్తుంది. ఇంటి దగ్గర మురళీకి ఫోన్ చేసి ఎందుకు నా ప్రాణం తీస్తారు. ఫోన్ చేసి విసిగించొద్దని నందు అరుస్తుంది. మురళీ మాత్రం ఇంటి వాళ్ల ముందు నటించి ఆఫీస్ లో మీటింగ్ ఉందంట.. ఇప్పుడు రాదని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






