Home

»

Tv News

Godavari Serial: జాను ప్లాన్ కి బిత్తరపోయిన సింహాద్రి.. మురళి సూపర్ పర్ఫామెన్స్!

Nov 4, 2026 9:38AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -154 లో..... వేలం పాట దగ్గర మురళీ రిచ్ మెన్ లా బిల్డప్ ఇస్తాడు. 50 వేల నుంచి మొదలైన వేలం పాటలో సింహాద్రి 60 వేలు అంటే మురళీ ఒక్క రూపాయి పెంచి పాడుతాడు. సింహాద్రి ఎన్ని లక్షలు చెప్పినా మురళీ ఒక్క రూపాయి అంటూ పోటీ పడతాడు. ల్యాండ్ వ్యాల్యూ చాలా ఉందని నిత్య పెంచమంటుంది. ఇద్దరూ పోటీ పడుతూ లక్షలకు వెళ్తారు.

మరోవైపు ఆకర్ష్, అలకనంద కలిసి ఆఫీస్ కి వస్తే స్టాఫ్ తప్పుగా మాట్లాడుతారు. అది విన్న ఆకర్ష్ వెంటనే స్టాఫ్ మీటింగ్ పెట్టి అలకనంద తన ఏరియాకి దగ్గర్లో ఉంటుంది అందుకే తీసుకొచ్చానని, అందరూ ఒకటేనని, అలకనంద ఏం స్పెషల్ కాదని చెప్తాడు. అందరూ సారీ చెప్తారు. తర్వాత మేనేజర్ అలకనందతో నువ్వు లక్కీ ఫెలోవి, ఎండీకి నీ మీద మంచి అభిప్రాయం ఉందని అంటాడు.

వేలంపాట దగ్గరకు జాను, సంజయ్ వస్తారు. సింహాద్రి 40 లక్షలకు వెళ్లేసరికి నిత్య ఆపేద్దాం అంటుంది. అది గమనించిన జాను బావ వేలంలో నువ్వే గెలుస్తావని సింహాద్రిని రెచ్చగొడుతుంది. దాంతో సింహాద్రి ఆగకుండా 90 లక్షల వరకు పాడుతాడు. వెంటనే మురళీ తనకు ఇంట్రెస్ట్ లేదని డ్రాప్ అయిపోతాడు. సింహాద్రి, నిత్య, సంజయ్ షాక్ అయిపోతారు.

వేలం పూర్తయి డాక్యుమెంట్స్ పై సంతకాలు అయ్యాక జాను, మురళీ నాటకం ఆడారని సింహాద్రి, నిత్యకు తెలిసి బిత్తరపోతారు. ఈ వేషం నేనే వేయించానని, నీతో ల్యాండ్ కొనిపించానని జాను చెప్పడంతో 25 లక్షల స్థలాన్ని 90 లక్షలకు కొనిపించావా అంటూ ఆవేశంతో నిత్యను తీసుకెళ్లిపోతాడు సింహాద్రి. మరోవైపు సంజయ్ సూపర్ జాను, భలే బోల్తా కొట్టించావంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆ  తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com