.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి' (Godavari). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -162 లో.. జాను బామ్మ, తాతయ్య, సంజుకి టిఫిన్ పెడుతుంది. సంజయ్ తో జాను మాట్లాడదు. ఈ అలక సీన్ ఎంత వరకు సాగదీస్తారని సంజయ్ అంటే సారీ చెప్పే వరకు అని జాను అంటుంది. ఇద్దరూ బామ్మ, తాతయ్యలను మధ్యలో మధ్యవర్తులుగా మాట్లాడుతూ ఉంటే మాకేంటి ఇది అని శివుడు అంటాడు. సారీ చెప్పేయ్ రా అంటే నా పరువు పోతుందని సంజయ్ అంటాడు. పెళ్లాల చేతుల్లో ఎవరూ గెలవలేరురా.. నా మాట వినేసి సారీ చెప్పేయ్ అంటాడు. నేను చెప్పనని సంజయ్ అంటే ఆ పిల్ల మంచిది కాబట్టి ఇంకా పంచాయితీ పెట్టించలేదు.. లేదంటే వాళ్ల ఇంట్లో అందరినీ పిలిచి అందరి ముందు సారీ చెప్పమంటే ఇంకా బాగోదు..దాని కంటే ఎవరూ లేనప్పుడు నువ్వు సారీ చెప్పేస్తే బెటర్ అంటారు.
నందు ఆఫీస్ కి వెళ్లి బాస్ ని విష్ చేస్తుంది. ఆకర్ష్ నందుతో నీ కోసమే వెయిట్ చేస్తున్నా, సంతకాలు కావాలని చెప్పి సంతకాలు పెట్టమంటాడు.నందు సంతకం పెట్టడానికి రెడీ అవుతూ మురళీకి గుండీ కుట్టినప్పుడు సూది గుచ్చుకున్న నొప్పికి పెన్ను పట్టుకోలేక అబ్బా అని అరుస్తుంది. దాంతో ఆకర్ష్ ఏమైందని అడిగి సూది గుచ్చుకుంది అనగానే ఆకర్ష్ చాలా టెన్షన్ పడి డాక్టర్ ని పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. స్టాఫ్ చూసి బాస్ చాలా ఎక్కువ చేస్తున్నాడు. అలకనందకి పడిపోయాడు.. నందునే బాస్ ని పడేసిందని అనుకుంటారు.ఏంటి సర్ ఇది చిన్న గాయానికి డాక్టర్ ఎందుకు డబ్బులు వేస్ట్ అని నందు అంటే నువ్వు డబ్బు చూస్తున్నావ్ నేను నీ బాధ చూస్తున్నానని ఆకర్ష్ అంటాడు.
మరోవైపు జాను కిచెన్ లో దోసెలు చేస్తుంటే సంజయ్ పేపర్ మీద సారీ అని రాసి జాను దగ్గరకు వెళ్లి ఐయామ్ వెరీ సారీ అంటూ సాంగ్ పాడుతాడు.జాను పేపర్ తీసి నలిపేసి డస్ట్ బిన్ లో పడేస్తుంది. హలో నటకుమారి ఈ బ్రహ్మచారి చెప్తున్నాడు నీకు సారీ అందుకో ఈసారి అని కవిత కూడా చెప్తాడు. తర్వాత కాలి మీద పెనం పడిపోయినట్లు నటిస్తాడు కానీ జాను ఉరిమి ఉరిమి చూస్తుంది. ఇటు గౌతమి, కిన్నెర ఇంట్లో అందరినీ పిలిచి దీపావళి పండగ వస్తుంది..షాపింగ్ చేద్దాం అంటారు. దానిని నందు షాపింగ్ లు జల్సాలు మనసులో నుంచి తీసేయ్ అంటుంది. రేపు నా టైలరింగ్ షాప్ ఓపెనింగ్ ఉంది.. నువ్వు నా పక్కనే ఉండాలి నందు అని మురళీ అంటే నీ షాప్ ఓపెనింగ్ కి నేను ఎందుకు.. నేను రాను అంటుంది. మీరు టైలర్ షాప్ తెరుచుకోండి.. పూజ చేసుకోండి.. నాకు సంబంధం లేదు నేను రాను.. నాకు ఆఫీస్ ఉందని నందు తేల్చేస్తుంది.మరోవైపు పారు, శివుడు బ్యాగ్ సర్దేస్తారు. జాను, సంజయ్ చూసి ఎక్కడికి అని అంటే నీకు పెళ్లి అయితే శ్రీశైలం వెళ్లి దీపం పెడదామనుకున్నామని అంటారు. దానికి సంజయ్ అసలు పెళ్లి అయితే కదా అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
