.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు' (Podarillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-259 లో.. కేశవ్ షాపులో లక్ష్మీ పూజ కోసం శైలూ చీర కట్టుకుని వెళ్తుండగా వరాలు, సురేష్ అడ్డుకుంటారు. పోలీసులను పిలుస్తానని బెదిరించి శైలూ వెళ్లిపోతుంది. అటు కొత్త స్థలం పేపర్లు మాధవ్ చేతుల మీదుగా కేశవ్ అందుకుంటాడు. కొత్త షాపు ఓపెనింగ్ చేయమని నారాయణను పిలవగా అందరం కలిసే ప్రారంభిద్దామని నారాయణ అంటాడు. కన్నాను నారాయణకు దగ్గర చేయడం కోసం చక్రి వేసిన ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అందరు నారాయణ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. కన్నాను కూడా తీసుకోమని చెప్పగా అతని కాళ్లు నేను పట్టుకోనని అంటాడు. నాకు అమ్మా నాన్న మాధవ్ అన్నయ్యేనంటూ మాధవ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. అయినా నేను వాడికి ఏం చేశానని వాడిని ఆశీర్వదించడానికి అని నారాయణ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
అందరు అక్కడి నుంచి వెళ్లిపోగా మహాకు చక్రి సారీ చెప్తాడు. నేను ఇలా జరుగుతుందని ఊహించలేదండి అని అంటాడు. మీరు చాలా మంచి పని చేశారని ఇలాంటి ఐడియా నాకు రాలేదని నేను సిగ్గుపడుతున్నానని మహా అంటుంది. మీరు వాళ్లిద్దరిని కలపడానికి చాలా ట్రై చేశారని మెచ్చుకుంటుంది. ఎప్పుడూ మహా నోటితో తిట్టించుకోవడమే తెలిసిన చక్రి, తొలిసారి ఆమె పొగడటంతో ఆనందంతో ఎగిరి గంతులేస్తాడు.
మరోవైపు కేశవ్ ఇచ్చిన చీర కట్టుకుని కొత్త షాపు ఓపెనింగ్ కు శైలూ బయల్దేరుతుంది. వాళ్ల అమ్మను పిలిచి చీర ఎలా ఉందని అడుగుతుంది. దీంతో వరాలు వచ్చి లబోదిబోమంటూ మొత్తుకుంటుంది. నువ్వు ఆ మెకానిక్ గాడితో లేచిపోవడానికే వెళ్తున్నావు కదూ అని గొడవ చేస్తుంది. సురేష్ ను పిలిచి తలుపు వేయమని చెప్తుంది. వాడు వచ్చి నువ్వు వెళ్లడానికి వీల్లేదని అంటాడు. నేను మీలా కుట్రలు చేయనని శైలూ అంటుంది. నేను లేచిపోయేదాన్నే అయితే మీకు చెప్పి ఎందుకు వెళ్తానని అంటుంది. మేం అందరికి చెప్పి అందరి సమక్షంలోనే పెళ్లి చేసుకుంటామని అంటుంది. ఆ తర్వాత అందరూ కేశవ్ కొత్త షాపు దగ్గరకు చేరుకుంటారు. స్థలం యజమాని పత్రాలు తెచ్చి కేశవ్ చేతికి ఇవ్వబోతుండగా, నేను ఇంతటి వాడిని కావడానికి మా అన్నయ్యే కారణమని అతని చేతికి ఇవ్వమని చెప్తాడు. ఆ పత్రాలు అందుకున్న మాధవ్ వాటిని కేశవ్ కు అప్పగిస్తాడు. ఇప్పుడు షాపు ఓపెనింగ్ ఎవరు చేస్తారని అడగ్గా శైలూ తనతో చేయిస్తాడేమోనని ఆశపడుతుంది. కానీ కేశవ్ వాళ్ల నాన్నను పిలుస్తాడు. ఇవాళ మీ పెద్దరికానికి గౌరవం ఇచ్చి కేశవ్ నిన్ను పిలుస్తున్నారు రమ్మని మహాలక్ష్మి అంటుంది. షాపులో లక్ష్మీ పూజకు జ్యోతి వెలిగించమని కేశవ్ మహాను పిలవడంతో శైలూకు కోపం వస్తుంది. అది గమనించిన నారాయణ ముగ్గురు కోడళ్లు జ్యోతి వెలిగించమని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
SEO keywords:




.webp)

