Home

»

Tv News

Ye Devi Varamo Neevu Serial: భవితని సేవ్ చేసిన అంజలికి.. నిజం తెలిసిపోయిందా!

Nov 13, 2026 8:02AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు' (Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ - 114 లో.. భవిత తాగి ఇంట్లోకి వస్తుంది. ఈ విషయం అమ్మగారికి తెలిస్తే బాధపడుతుందని అంజలి అంటుంది. అయితే ఏంటని భవిత అంటుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు కానీ నిన్ను ఇక్కడ పర్మినెంట్ గా ఉండనివ్వనని భవిత అంటుంది. నేను అమ్మగారి పెద్ద కూతుర్ని అని తెలిసిపోయిందా ఏంటని అంజలి టెన్షన్ పడుతుంది. భవిత ఇంట్లో ఉన్న బెల్ ని కొట్టగా అందరు వస్తారు.

ఏమైంది ఎందుకు బెల్ కొట్టావని అంజలిని అడుగుతారు. భవిత ఎవరికి కనిపించకుండా సోఫాలో పడుకుంటుంది. అందరూ వచ్చి అంజలిని అడుగుతుంటే పిల్లి వచ్చింది.. ఎవరో అనుకుని భయమేసి కొట్టానని అంజలి కవర్ చేస్తుంది. ఎందుకు నిజం చెప్పలేదని భవిత అడుగుతుంది. నీ గురించి తెలిస్తే అమ్మ బాధపడుతుంది. అలా బాధపడడం నాకు ఇష్టం లేదని అంజలి అంటుంది. మరుసటి రోజు అంజలి కిచెన్ లో భవితకి నిజం తెలిసి ఉంటుందేమోనని ఆలోచిస్తుంటే పాలు పొంగిపోతాయి. అప్పుడే గీత వచ్చి ఏమైంది నీకు అని అడుగుతుంది. ఏం లేదని అంజలి అంటుంది. ఆ తర్వాత హాల్లో భవితతో గీత మాట్లాడుతుంటే నా గురించి చెప్తుందేమోనని అంజలి టెన్షన్ పడుతుంది. కాఫీ కప్ కింద పడేస్తుంది. ఏంటి అంజలి ఈ రోజు ఇలా చేస్తున్నావని గీత కోప్పడుతుంది.

ఆ తర్వాత అంజలి దగ్గరికి గీత వచ్చి దీపావళి అన్ని రకాల వంటలు చేయాలని ఆర్డర్ వేస్తుంది. మరోవైపు రాకీ కనిపించిన ప్రతి వాళ్ళని డబ్బు అడుగుతాడు. అప్పుడే అంజలి ఎదురుపడి కోప్పడుతుంది.అంజలిని తప్పయిందని రిక్వెస్ట్ చేసినా అంజలి మాత్రం కోపంగా మళ్లీ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com