.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు' (Podarillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ - 257 లో.. వంటగదిలో పెద్ది, మనీషా నవ్వుకుంటుంటే చక్రి వచ్చి వంట నేర్పుతున్నారా లేక ప్రేమ పాఠాలు నేర్పుతున్నారా అని సరదాగా అంటాడు. ఇంతలో కేశవ, శైలు వస్తారు. షాప్‌కి పేరు మారిస్తే కలిసివస్తుందని మహాలక్ష్మి పేరు పెడదామని చక్రి అంటే శైలు ఫీల్ అవుతుంది. దాన్ని గమనించిన మహా.. నా పేరు వద్దు, కేశవ ఈ స్థాయికి రావడానికి కారణం పెద్ది అని మాధవ బైక్ సర్వీసెస్ అని పెడదామని అంటుంది. అందరు వేరే వేరే పేర్లు చెప్పి వాదించుకుంటుంటే నారాయణ వచ్చి చీటీలు వేసి తీయమని ఐడియా ఇస్తాడు.
కేశవను శైలు బయటకు తీసుకెళ్లి నీకు ఏ పేరు పెట్టాలని ఉందని అడుగుతుంది.మనసులో అన్నయ్య పేరు పెట్టాలని ఉన్నా, శైలు గొడవ చేస్తుందని నీ పేరే పెట్టాలని ఉందని కేశవ అబద్ధం చెప్తాడు. లోపల అందరూ చీటీలు రాసి బౌల్లో వేస్తారు. కేశవ మాత్రం శైలు పేరు రాయకుండా అన్నయ్య పేరు రాస్తాడు. మహాలక్ష్మిని చీటీ తీయమంటే తను తీసి సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ నేను అనుకున్న పేరే వచ్చింది.. రేపు పూజ టైంకి బోర్డ్ రెడీగా ఉంచుతానని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత శైలు చీటీలు చెక్ చేసి అందులో తన పేరు లేదని తెలుసుకుని కేశవను నిలదీస్తుంది.
నేను నీ పేరే రాశానని కేశవ అబద్ధం చెప్పినా శైలు చీటీ చూపించడంతో దొరికిపోతాడు. వెంటనే మాయమాటలు చెప్తూ.. నువ్వు ఆల్రెడీ నా గుండెల్లో ఉన్నావ్, మనమంటే ఒక్కరమేగా, షాప్‌కు నీ పేరు పెట్టి మన ప్రేమను తగ్గించాలా అని బుట్టలో వేస్తాడు. దాంతో శైలు కూల్ అవుతుంది. కేశవ ఆమెకు పూజ కోసం చీర గిఫ్ట్ ఇస్తాడు. ఇంట్లో అందరికి కేశవ కొత్త బట్టలు ఇస్తాడు. మనీషాకు కూడా ఇచ్చి త్వరలో పెద్ద వదినగా వస్తారని అంటాడు. నారాయణకు కూడా బట్టలు తీసుకెళ్లి ఇచ్చి రేపు షాప్ ఓపెనింగ్‌కి రమ్మంటాడు. అది చూసిన కన్నా కోపంతో ఐ హేట్ యూ ఆల్ అంటూ వెళ్లిపోతాడు. చివర్లో మాధవ, మనీషాలతో నారాయణ ఆశీర్వాదం తీసుకోమని చక్రి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
