.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -155 లో.....నందు తన బాస్ తో మాట్లాడి తిరిగి వెళ్తూ పడిపోతుంటే ఆకర్ష్ పట్టుకుంటాడు. ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటారు, ఆ తర్వాత నందు వెళ్లిపోతుంది. మరోవైపు జాను ల్యాండ్ అమ్మి మూడు రెట్లు లాభం తెచ్చినందుకు అందరు పొగిడేస్తారు. జాను అందరికి స్వీట్స్ పంచుతుంది. పారు, శివుడు సంజయ్ తో జానుని నీతో పాటు తీసుకెళ్లరా మంచి ఐడియాలు ఇస్తుందని అంటారు. జీతం ఇస్తే పని చేస్తానని జాను అనగా ఈ మేధావి సాయం అస్సలు తీసుకోను...అవసరమైతే నష్టాలు వచ్చినా పర్లేదని సంజయ్ అంటాడు.
నందు ఇంటికి దిగులుగా వస్తుంది. ఎవరు పిలిచినా పలకకుండా గదిలోకి వెళ్లి ఒక్క అబద్ధం నా జీవితాన్ని మార్చేస్తుందా, నా జీవితంతో నేనే ఆడుకుంటున్నానా అని బాధపడుతుంది. తాళి తీసేయడం గుర్తుచేసుకొని నా కల కోసం దిగజారిపోతున్నానా అని ఏడుస్తుంది. బయట అందరూ నందుకి ఏమైందని ఆందోళన పడతారు. తర్వాత మురళీని చూసి.. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే అమెరికా వెళ్లేదాన్ని, నీకు పెద్ద ఆశయాలు లేవు బావ కానీ నాకు ఉన్నాయని మనసులో అనుకుంటుంది. నువ్వే నన్ను గెలిపించాలని కోరుకుంటుంది..మ నిద్రపోయినట్లు నటిస్తున్న మురళి ఆ మాటలు వింటాడు.
జాను, సంజయ్ ల మధ్య ఫన్నీ గొడవ మొదలవుతుంది. కంగ్రాట్స్ సరిగ్గా చెప్పలేదని జాను అడిగితే ఒకసారి చెప్పడమే ఎక్కువ.. నిన్ను పట్టించుకోనని సంజయ్ అంటాడు. దీంతో కమీషన్ ఇవ్వమని జాను డిమాండ్ చేస్తుంది. సింహాద్రి డబ్బు ఇంకా ఇవ్వలేదని సంజయ్ అనడంతో జాను అతని ఫోన్ దాచేస్తుంది. ఫోన్ కోసం సంజయ్ వెతికి చివరికి జానుని అడగ్గా కమీషన్ ఇస్తేనే ఫోన్ ఇస్తానని కండిషన్ పెడుతుంది. చేసేది లేక సంజయ్ సరే అనడంతో దాచిన ఫోన్ తిరిగి ఇస్తుంది. దీంతో సంజయ్ షాక్ అయి మండిపడతాడు.
మరోవైపు ఉదయం గౌతమి తన ఫ్రెండ్ తో కాలేజీకి రావడం లేదు ఫీజు కట్టలేదని చెప్తుండగా జాను ఆ మాటలు వింటుంది. డబ్బు ఏర్పాటు కాగానే కడతానని జాను చెప్పడంతో నువ్వు కోటీశ్వరుడి భార్యవి కదా, నీ దగ్గర డబ్బు లేకపోవడం ఏంటి, నీ స్వార్థం నువ్వు చూసుకున్నావని చెప్పు అక్క అని గౌతమి ఏడుస్తుంది. నాన్న ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
