Home

»

Tv News

Ye Devi Varamo Neevu : రాకీ, రోహిత్ లని తీసుకెళ్ళిన పోలీసులు.. అంజలి ఏం చెప్పిందంటే!

Nov 5, 2026 9:02AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -107 లో..... అంజలి దగ్గరికి కృష్ణజ, ప్రీతీ వచ్చి మాట్లాడుతారు. నువ్వు త్వరగా కోలుకోవాలని మేం చాలా మొక్కుకున్నామని అంటారు. మీ మొక్కు ఫలించి అంజలి త్వరగా కోలుకుందని రత్నం అంటుంది. ఆ తర్వాత రాకీకీ అంజలి గడువు ఇచ్చిన విషయం గుర్తుకు వచ్చి..సమయం పూర్తి అయింది ఇప్పుడు రాకీ వెళ్ళిపోకుంటే వెంటనే అందరికి జరిగింది చెప్పాలి అని అంజలి హాల్లోకీ వెళ్తుంది.

ఏంటి అంజలి ఇలా వచ్చావని మనిష్ అడుగుతాడు. ఒకసారి మీ తమ్ముడు రాకీని పిల్వండి తన గురించి ఒక విషయం చెప్పాలని అంటుంది. దాంతో రాకీని మనీష్ పిలుస్తాడు. రాకీ భయపడుతూ కిందకు వస్తాడు. అంజలి దగ్గరికి రాగానే కళ్ళు తిరిగి పడిపోతాడు. దాంతో డాక్టర్ ని పిలుస్తాడు. డాక్టర్ వచ్చి అతనికి బాగా ఫీవర్ ఉందని చెప్తాడు. అయితే మా బావ ఇప్పుడు బయటకు వెళ్లడా అని రోహిత్ అనగానే ఈ పరిస్థితిలో బయటకు ఎందుకు అని గీత అంటుంది. అంటే కాలేజీకీ అని రోహిత్ అంటాడు. ఆ తర్వాత అవును అంజలి నువ్వు ఏదో రాకీ గురించి చెప్పాలన్నావ్ ఏంటది అని మనీష్ అనగానే రాకీ ఎవరితోనూ మాట్లాడుతుంటే విన్నాను నాకు చాలా జ్వరంగా ఉందని అనడం ఆ విషయం చెప్పాలని తనకి జ్వరం వచ్చిందని అందరికి తెలియాలని అనుకున్నానని అంజలి అంటుంది. ఆ తర్వాత అందరూ వెళ్ళాక నువ్వు రేపటి లోగా వెళ్ళాలేదంటే అందరికి నిజం చెప్తానని అంజలి వార్నింగ్ ఇస్తుంది.

ఆ తర్వాత గీత హాల్లో పడుకొని ఉంటుంది. అంజలి వెళ్లి తన కాళ్ళు మొక్కుతుంది. ఏమైందని గీత అడుగుతుంది. నాకు రక్తం ఇచ్చి కాపాడారు కదా అని అంజలి అంటుంది. ఆ తర్వాత ఆ అంజలి మనల్ని బెదిరిస్తుందా తననే అత్తయ్య ఇంట్లో నుంచి బయటకు పంపేలా చేస్తానని రోహిత్ తో రాకీ అంటాడు. ఆ మాటలు అంజలి విని రాకీని హాల్లోకీ లాక్కొని వెళ్తుంది. తరువాయి భాగంలో అంజలి ఇంట్లో వాళ్ళకి ఏదో చెప్తుంది పోలీసులు వచ్చి రాకీ, రోహిత్ ని తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలాంటి తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com