Home

»

Tv News

Jayam Serial: వీరు ప్లాన్ లో ఇరుక్కున్న వంశీ, సూర్య ..రుద్ర ఏం చేయనున్నాడు!

Nov 5, 2026 8:56AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్- 419 లో ప్రీతి బాబు బారసాల ఫంక్షన్‌తో మొదలవుతుంది. ఫంక్షన్‌లో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఫంక్షన్ పూర్తయ్యాక పంతులు చేత బాబు జాతకం చూపిస్తారు. పంతులు జాతకం చూసి ఈ బాబుకి మేనమామ గండం ఉందని చెప్పడంతో అందరు షాక్ అవుతారు. దానికి పరిష్కారంగా బాబుని మేనమామ కొన్ని రోజులు దూరంగా ఉండాలని పంతులు చెప్తాడు. దీంతో రుద్ర సరే అంటాడు. బాబుని చూడకుండా ఉంటే సరిపోతుందని అవుట్ హౌస్‌లో ఉండమని పెద్దసారు చెప్తాడు.

ఆ తర్వాత విశ్వ వాళ్లు ఇంటికి వస్తారు. ఎందుకు ఇలా చేశావ్ జయ అని విశ్వ కోప్పడతాడు. సారీ నాన్న వంశీ ఇస్తానంటే నేనేం చేయాలి, ఫంక్షన్ అయ్యాక మీకు చెపుదాం అనుకున్నానని జయ అంటుంది. అదంతా తెలిసినా నువ్వు గంగా పేరెంట్స్ తప్పు చేశారని ఎలా అన్నావ్ అని విశ్వ అడగ్గా నాపై డౌట్ రాకుండా అలా చేశానని జయ అంటుంది. నువ్వు నా పేరు నిలబెడతావ్ అనుకున్నా కానీ ఇలా పరువు తీస్తావనుకోలేదని విశ్వ కోప్పడతాడు.

మరోవైపు వంశీ జరిగింది గుర్తు చేసుకొని బాధపడుతుంటే వీరు, ఇషిక రెచ్చగొడతారు. నా తమ్ముడిని కొడతాడా అని రుద్రపై సూర్య కోపంగా ఉంటాడు. ఇషిక, వీరు కలిసి సూర్య, వంశీకి రుద్రపై కోపం కలిగేలా.. తనకి ఎదురు మాట్లాడేలా చేస్తారు. బావ నువ్వు ముందుండి చూసుకో వెనకాల మేం ఉంటాం, ఆ రుద్ర సంగతి చెప్పాలని సూర్య అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com