
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-261 లో.. మహాతో దిగిన ఫొటోతో చక్రి వాట్సాప్ స్టేటస్ పెడతాడు. నా భార్యతో నేను తొలి దీపావళి జరుపుకోబోతున్నానంటూ క్యాప్షన్ పెడతాడు. అది చూసిన ఇంట్లో అందరు భయపడిపోతారు. ఇవాళ నీకు ఖచ్చితంగా ఉందని కన్నా, కేశవ్ చక్రిని ఏడిపిస్తారు. కొంపదీసి వదినను హైడ్ చేసి పెట్టావా అని అడుగుతారు. లేదురా మహాలక్ష్మి చూడాలనే స్టేటస్ పెట్టానని, నా మీద మీ వదినకు నిజంగానే ప్రేమ ఉందిరా కాకపోతే బయటపడటం లేదని చక్రి అంటాడు.
ఎంతసేపు అయినా మహాలక్ష్మి ఫోన్ చూడకపోవడంతో చక్రి ఆమెను పిలిచి మీ ఫోన్ ఛార్జింగ్ ఫుల్ అయ్యింది, చాలా మెసేజ్ లు వచ్చాయని చెప్తాడు. దీంతో మహాలక్ష్మి వెళ్లి మెసేజ్ లు చూసి కోపంగా చక్రి దగ్గరకు వస్తుంది. స్టేటస్ లు చూసి ఉంటుందని ఇంట్లో అంతా అనుకుంటారు. కానీ మహా ఇన్ని మెసేజ్ లు వస్తే నాకు చెప్పకుండా ఏం చేస్తున్నారని చక్రిపై అరిచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మళ్లీ గదిలోకి వెళ్లి స్టేటస్ లు చూస్తుంది. చక్రి స్టేటస్ కూడా చూసినట్లు చక్రి ఫోన్ లో తెలిసిపోవడంతో చక్రి ఆనందంతో మెలికలు తిరుగుతాడు. బయటకు వచ్చిన మహా ఏం అనకుండా వెళ్లిపోతుంటే వదినా అన్ని స్టేటస్ లు చూశావా అని కన్నా అడుగుతాడు. చూశానని, కొన్నింటికి లైక్ లు కూడా కొట్టానని మహా చెప్తుంది.
దీపావళి పండుగ కావడంతో బృందావనం అంతా దీపాలతో అలంకరిస్తారు. ఇంటికి లైటింగ్ పెట్టిస్తారు. ఇది చూసిన నారాయణ కళ్లల్లో ఆనందం నిండిపోతుంది. ఎన్నో రోజుల తర్వాత ఈ ఇంటికి మళ్లీ కళ వచ్చిందని అంటాడు. కొడుకులు, కోడళ్లు అంతా కొత్త బట్టలు కట్టుకుని పండుగ జరుపుకోవడం చూసి సంతోషిస్తాడు. అందరు క్రాకర్స్ కాల్చి పండుగ జరుపుకుంటారు. ఈ వేడుకల్లో కన్నా, నారాయణను కలిపేందుకు చక్రి వేసిన ప్లాన్ చెప్తే మహా తిడుతుంది. ఇది ఎంతో ప్రమాదంతో కూడుకున్న ప్లాన్ అని నాకు చెప్పి ఉంటే బెటర్ ఐడియా చెప్పేదాన్ని కదా అని మండిపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






