ఫరియా బాయ్ ఫ్రెండ్ హైట్ తెలుసా..?
on Feb 2, 2025
ఆహా ప్లాట్ ఫామ్ మీద డాన్స్ ఐకాన్ సీజన్ 2 కలర్ థీమ్ తో మన ముందుకు ప్రేమికుల రోజున రాబోతోంది. ఇక ఈ సీజన్ ప్రోమో చూస్తే ఫుల్ జోష్ తో ఉంది. హోస్ట్ గా యాంకర్ ఓంకార్ ఉన్నారు. ఇక జడ్జెస్ గా ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ వచ్చారు. యష్ మాష్టర్, జానులూరి, బ్రహ్మముడి మానస్, దీపిక రంగరాజు, ‘మిస్ తెలంగాణ- 2024’ టైటిల్ విజేత ప్రకృతి కంబం, రోహిణి వచ్చారు.
ఇక ఫరియా హైట్ ఎంతో తెలుసు కదా 6 ఫీట్ ఉంటుంది. అంత హైట్ ముందు అదే హైట్ అబ్బాయి ఉంటేనే కనిపిస్తారు. దాంతో ఓంకార్ కి డౌట్ వచ్చి "మీకు రియల్ లైఫ్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా" అంటూ ఒక చిన్న రెడ్ పప్పీ బొమ్మను ఇస్తూ అడిగాడు. దానికి ఫరియా సిగ్గు పడుతూ ఉన్నాడు అని చెప్పింది. "మీ బాయ్ ఫ్రెండ్ హైట్ ఎంత" అని అడిగాడు "ఆల్మోస్ట్ సిక్స్" అని చెప్పింది. తర్వాత యష్ మాస్టర్ వచ్చారు. "నువ్వు ఇప్పటి వరకు ఎంతమందిని కిస్ చేసావ్" అని అడిగాడు ఓంకార్. "15 ఏళ్ళ క్రితం ఫస్ట్ కిస్ చేసాను" అని చెప్పేసరికి . "సర్ నేను వెళ్ళిపోతా..ఈ అబద్దాలు నమ్మను" అంటూ చెప్పాడు శేఖర్ మాష్టర్.
ఇక దీపికా రంగరాజు నాన్ సింక్ స్టెప్స్ తో డాన్స్ చేస్తూ వచ్చింది. ఓంకార్ చాక్లెట్ ఇవ్వగా, అది తీసుకుని తింటూ శేఖర్ మాస్టర్ కి తినిపించబోయేసరికి భయపడి పారిపోయాడు. తర్వాత దీపికా నడుమును వర్ణించమంటూ మానస్ కి చెప్పాడు ఓంకార్. "యష్ మాష్టర్ అంత దగ్గర నుంచి చూస్తూ ఆయనే వర్ణించలేకపోతున్నాడు నేనేం వర్ణిస్తాను" అన్నాడు. "యష్ మాష్టర్ నడుమును చూడమంటే వేరే ఎక్కడో చూస్తున్నాడు" అని యష్ పరువు మొత్తం తీసేసింది దీపికా.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
