ఇంట్లో వాళ్ళని అప్పుల పాలు చేసి ఫారెన్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా?
on Feb 1, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -634 లో... రాజ్ వీసా అప్లై చేయమని ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంటే.. రుద్రాణి వింటుంది. వీళ్ళు ఇంట్లో వాళ్ళని అప్పుల పాలు చేసి ఫారెన్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారని అనుకుంటుంది. అప్పుడే కావ్య ఇంగ్లీష్ డిక్షనరీ చదువుతూ కన్పిస్తుంది. దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నావని రుద్రాణి అడుగగా.. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానని కావ్య చెప్తుంది. కావ్య వచ్చి రాని ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే.. రుద్రాణి వినలేకపోతుంది.
మీ గుట్టురట్టు చేస్తానని ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వెళ్లి.. వాళ్ళు అమెరికాకి వెళ్ళాలనుకుంటాన్నారని చెప్తుంది. అది విన్న ధాన్యలక్ష్మి.. నువ్వు చెప్పింది విని అందరిని వెళ్లి అడగాలి. అప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెప్పి డైవర్ట్ చేస్తారు. అక్కడ వెర్రిదాన్ని అయ్యేది నేనే.. అందుకే మూడు నెలల టైమ్ అడిగారు కదా.. అందుకే అప్పటివరకు సైలెంట్ గా ఉందామనుకుంటున్నానని ధాన్యలక్ష్మి అనగానే.. దీన్ని నా వైపుకి తిప్పుకోవాలనుకున్న ప్రతీసారి నన్నే బాధపెడుతుందని రుద్రాణి అనుకుటుంది.
ఆ తర్వాత కావ్య ఆఫీస్ కి వెళ్తూ.. బ్రోకర్ వస్తాడు.. ఈ ఫైల్ ఇవ్వమని స్వప్నకి ఫైల్ ఇచ్చి వెళ్తుంది. అది చూసి ఏం ఫైల్ అంటూ రుద్రాణి లాక్కొని చూస్తుంటే.. స్వప్న తన దగ్గర నుండి లాక్కుంటుంది. మరోవైపు లిరిక్ రైటర్ దగ్గరికి కళ్యాణ్ పాట రాసుకొని తీసుకొని వస్తాడు. అది చూసి చాలా బాగుందని కళ్యాణ్ ని ఆ రైటర్ మెచ్చుకుంటాడు. అప్పుడే ప్రొడ్యూసర్ వచ్చి పాట తీసుకొని బాగుందని అంటాడు. ఇక్కడ ఈ వర్డ్ వస్తే బాగుండని ప్రొడ్యూసర్ అంటాడు. ప్రొడ్యూసర్ వెళ్తుంటే.. కళ్యాణ్ వెళ్లి ఆ వర్డ్ దగ్గర ఇది ఈ వర్డ్ పెట్టండి అని చెప్పగానే.. చాలా బాగుంది ఈ పాట నువ్వే రాసావ్.. నాకు తెలుసని కళ్యాణ్ ని మెచ్చుకుంటాడు.
రాజ్, కావ్య వెళ్తుంటే.. రాజ్ ఫ్రెండ్ ఫోన్ చేసి నంద గోపాల్ ని షూట్ చేసింది ఎవరో ఇంకా తెలియలేదని చెప్తాడు. ట్రాఫిక్ సిగ్నల్ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కనుకోవచ్చని అతను చెప్పగానే రాజ్ సరే అంటాడు. కావ్య చెప్పిన బ్రోకర్ ఇంటికి వస్తాడు. స్వప్న ఫైల్ ఇస్తుంది. ఎందుకు అవి అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. వీసాకి అని చెప్తాడు. చూసావా ధాన్యలక్ష్మి నేను చెప్తే వినలేదని రుద్రాణి అంటుంది.
తరువాయి భాగంలో ఏంటి రాజ్.. రుద్రాణి, ధాన్యలక్ష్మి ల ఆస్తులన్నీ డాలర్ లో మార్చి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నావా అని అపర్ణ అనగానే.. రాజ్, కావ్య షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
