బావని నాకు ఇచ్చేస్తే డబ్బులిస్తా.. జ్యోత్స్న కన్నింగ్ తెలిసి షాకైన పారిజాతం!
on Feb 2, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -270 లో..... శౌర్య గురించి దీప బాధపడుతుంటే.. అప్పుడే కార్తీక్ వస్తాడు. డబ్బు కట్టారా అని దీప అడగ్గానే కట్టాను కానీ నాలుగు లక్షలు కట్టానని కార్తీక్ అనగానే.. మరి మిగతా నలభై ఒక్క లక్ష ఎలా అని దీప బాధపడుతుంది.
అప్పుడే నర్స్ వచ్చి పాప ఏడుస్తుందని చెప్పగానే ఇద్దరు శౌర్య దగ్గరికి వెళ్తారు. ఎందుకు ఏడుస్తున్నావని ఇద్దరు అడుగుతారు. నేనేం ఏడవట్లేదు నాకు ఇంజక్షన్ వేస్తానంటున్నారు. భయం వేసిందని శౌర్య ఎమోషనల్ గా మాట్లాడేసరికి.. కార్తీక్, దీపలు బాధపడతారు. ఆ తర్వాత ఇక ట్రీట్మెంట్ ఆపేస్తాం.. మీరు ఇంకా డబ్బు కట్టలేదని కోప్పడుతుంటే కార్తీక్ రిక్వెస్ట్ చేస్తాడు. ఎలాగైనా ఆపరేషన్ టైమ్ కి కట్టేస్తానని కార్తీక్ చెప్తాడు. దాస్ ని చూడడానికి కావేరి వస్తుంది. ఆ తర్వాత కాసేపటికి శ్రీధర్ వస్తాడు. ఇక ఎప్పటిలాగే స్వప్న, శ్రీధర్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. దాస్ గురించి కాశీని అడుగుతాడు శ్రీధర్.
అనసూయ, కాంచనలు గుడికి వెళ్లి.. శౌర్య గురించి మొక్కుకుంటారు. సుమిత్ర, దశరథ్ ల దగ్గరికి కాశీ వెళ్లి.. నిజంగానే శౌర్య కి బాలేదు.. ఇప్పుడు ఆపరేషన్ చెయ్యకపోతే బ్రతకదని చెప్తాడు. దాంతో మనం సాయం చెయ్యాలని సుమిత్ర అనగానే..అంత డబ్బు నాన్నకి తెలియకుండా అంటే కష్టమని దశరథ్ అంటాడు. మరోవైపు దీప ఫోన్ చేస్తుందేమోనని జ్యోత్స్న చూస్తూ ఉంటుంది. అప్పుడే పారిజాతం వస్తుంది. నిజంగానే శౌర్యకి బాలేదు.. ఆ విషయం నిజమేనని తెలిస్తే ఇంట్లో వాళ్ళు సాయం చేస్తారని చెప్పలేదని జ్యోత్స్న అనగానే.. పారిజాతం షాక్ అవుతుంది. బావని నాకు ఇవ్వమని అడిగాను.. డబ్బులు ఇస్తానన్నానని జ్యోత్స్న పారిజాతానికి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
